ఇదేం స్టయిలిష్‌ కాస్ట్యూమ్‌! కానీ ధర వింటే షాకవ్వడం ఖాయం!

Balenciaga Rs 76000 Towel Skirt Shocks Ikea Mocks With Their Version - Sakshi

చాలా విభన్నమైన స్టయిలిష్‌ కాస్ట్యూమ్స్‌ని డిజైన్‌ చేస్తుంటారు డిజైనర్లు. ఒక్కొక్కరిది ఒక్కో తరహా స్టయిల్‌. వెస్ట్రన్‌ స్టయిల్‌ కొందరూ దేశీ సంస్కృతిని మిళితం చేసేలా ఇంకొకరు ఎంచుకుని మరి కళ్లు చెదిరే కాస్ట్యూమ్స్‌ని తయారు చేస్తారు. వాటి ధరలు కూడా ఎక్కువే. ప్రముఖ​ సెలబ్రెటీలకు మంచి బ్రాండెడ్‌ కాస్ట్యూమ్స్‌ అందించేది వారే. రాను రాను ఎలా డిజైన చేయాలో తెలియాక ఒక్కొసారి ఇలా పిచ్చిగా డిజైన్‌ చేస్తారో లేక ఏం తోచక ఇలా చేస్తారో గానీ ఇదే వెర్రీ అనిపించేలా ఉంటాయి ఆ కాస్ట్యూమ్‌లు. అది కూడా మంచి పేరుగాంచిన ఓ ప్రముఖ కంపెనీ యే ఇలాంటి డిజైన్‌ని తీసుకొస్తే..ఛీ ఏంటీ ఇవి కూడా ఇలా దిగజారిపోతున్నాయా? లేక బ్రాండ్‌ పడిపోయిందా? అనిపిస్తాయి. అలాంటి పిచ్చి కాస్ట్యూమ్‌నే ఓ ప్రముఖ కంపెనీ విడుదల చేసి అందర్నీ కంగుతినేలా చేసింది. 

వివరాల్లోకెళ్తే..ఫ్రాన్స్‌కి చెందిన ప్రముఖ బాలెన్సియగా ఫ్యాషన్‌ బ్రాండ్‌ కంపెనీ అత్యంత వెరైటీగా ఓ టవల్‌ స్కర్ట్‌ డిజైన్‌వేర్‌ని పరిచయం చేసింది. అది మన ఇళ్లలోని పెద్ద చిన్న మగవాళ్లంతా ప్రతి రోజు కనిపించే తీరు తరహా స్టయిలే అది. అది ఎవర్నీ ఆకర్షించకపోగా దాని ధర చూసి ఒక్కసారిగా భగ్గమంటున్నారు నెటిజన్లు. ఇంతకీ ఈ టవల్‌ స్కర్ట్‌ డిజైన్‌ వేర్‌ ఏంటంటే ఏం లేదు జస్ట్‌ ఫ్యాంట్‌పై టవల్‌ కట్టుకునేలా స్టయిల్‌. నిజానికి ఇది స్టయిల్‌ కాదు.

మన ఇంట్లో మగవాళ్లు ఫ్యాంటు తీసే ముందు ఇదే తరహాలో టవల్‌ చుట్టుకుని ఉంటారు. దీన్నే గ్రేట్‌ డిజైన్‌ అంటూ విడుదల చేయడం ఒక ఎత్తు అయితే, ధర ఏకంగా రూ 76,000 వేలు అని ప్రకటించడం మరింత విడ్డూరం. దీంతో ప్రముఖ గృహోపకరణాల కంపెనీ ఐకియా ఈ డిజైన్‌కి అయ్యే ఖర్చు జస్ట్‌ రూ. 1700/- కంటే ఎక్కవ అవ్వదంటూ అందుకు సంబంధించిన సేమ్‌ మోడల్‌ని నెట్టింట షేర్‌ చేసింది. పలువులురు నెటిజన్లు కూడా ఐకియాకు మద్దతు ఇస్తూ అవును అంతకంటే ఎక్కువ ధరేమి ఉండదు. పోనీ ఆ టవల్‌ జస్ట్‌ కాటన్‌ టర్కీ టవల్‌. దాని ధర కూడా అంత ఉండదు. కానీ ఏకంగా ఫ్యాంట్‌ విత్‌ టవల్‌ కలిపి అంత ధర ప్రకటించారని మండిపడ్డారు. మరో నెటిజన్‌ ప్రతి కుటుంబంలోని డాడీలు ఉండే స్టయిలే అది బాస్‌ అంటూ కామెంట్‌ చేశారు. 

(చదవండి: విష్ణు విరానికాల గారాల పట్టి ధరించిన డ్రస్‌ ధర వింటే షాకవ్వుతారు!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top