మెట్రోలో ఇన్‌ఫ్లూయెన్సర్‌ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్‌ | Indian-Origin Girl's Desi Look On Train In Paris Got Million Views | Sakshi
Sakshi News home page

మెట్రోలో ఇన్‌ఫ్లూయెన్సర్‌ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్‌

May 20 2025 11:33 AM | Updated on May 20 2025 12:45 PM

Indian-Origin Girl's Desi Look On Train In Paris Got Million Views

భారతీయ సంస్కృతి, ఫ్యాషన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నాయి. అనేక అంతర్జాతీయ ఈవెంట్లలో మన ఫ్యాషన్‌ స్టైల్‌ ఫ్యాషన్‌ ప్రియులనుంచి సామాన్యులదాకా ప్రత్యేక ఆకర్షణగా  నిలుస్తోంది.  మెట్ గాలా, కేన్స్‌ లాంటి ప్రతిష్టాత్మక వేదికలు, ఐకానిక్ ప్రపంచ వేదికలపై మన భారతీయ నటీమణులు, సెలబ్రిటీలు భారత సంప్రదాయ ఫ్యాషన్‌ శైలిని ప్రదర్శిస్తున్నారు.  రెడ్ కార్పెట్  దేశీ సంస్కృతిని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది కేవలం తారలు మాత్రమే కాదు..వివిధ స్థాయిలలో భారతీయ వారసత్వాన్ని ప్రభావితం చేస్తున్న సామాన్యులకు కూడా కొదవేమీ లేదు. తాజా వీడియో ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. 
 

ఢిల్లీ మెట్రోలో లెహంగాలు, అనార్కలి లేదా చీరలు ధరించి రీల్స్‌ చేసే అమ్మాయిలను చూసి ఉంటారు. కానీ విదేశాల్లో మెట్రోలో చీర లేదా మన సంప్రదాయ దుస్తులు ధరించిన యువతులను చూడటం చాలా అరుదు. తాజా ప్యారిస్‌లోని మెట్రోలో ఒక లెహంగాలో అందంగా మెరిసిన యువతి  ప్రస్తుతం   సోషల్‌ మీడియాలో నివ్య సందడి చేస్తోంది. 

ఇదీ చదవండి: నిహారికను తీర్చిదిద్దిన శిల్పి ఆమె తల్లే!

భారతీయ సంతతికి చెందిన ఫ్యాషన్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ నివ్య  ప్యారిస్‌లోని స్థానిక రైలులో అందమైన లెహెంగాలో ప్రయాణించడమే కాదు, చక్కటి హావభావాలను ఆకట్టుకుంది. లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న తన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు తెగ మురిసి పోతున్నారు. నివ్య బ్రైట్‌ నారింజ రంగు భారీ లెహంగాలో మెరిసింది.  క్లిష్టమైన బంగారు ఎంబ్రాయిడరీ జరీ వర్క్ లెహెంగాకు స్లీవ్‌లెస్ చోలి సెట్‌,  ఇతర నగలతో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. కూల్‌...కూల్‌గా గాగుల్స్‌ పెట్టుకుని మరింత స్టైల్‌గా కనిపించింది. గత ఏడాది నవంబరులో షేర్‌ చేసిన ఈ వీడియో ఏకంగా  10 లక్షలకు పైగా వ్యూస్‌, వేల కామెంట్లను సొంతం చేసుకుంది.

 యూరప్‌లో భారతీయ సంస్కృతిని ప్రదర్శిస్తూ, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించిన నివ్యను  నెటిజన్లు ప్రశంసించారు. చాలా అందంగాఉన్నారనే కామెంట్లు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్‌లోని మెట్రోలో బంగారు నగలతో ప్రయాణిస్తున్నారా? సేఫ్టీ ఫస్ట్‌. ఇవి  కాస్ట్యూమ్ ఆభరణాలు అయితే మంచిది. అవి మీ అమ్మగారి ఆభరణాలు కాకూడదని అనుకుంటున్నా అంటూ మరో నెటిజన్‌ వ్యాఖ్యానించారు.  ఇదే లెహంగాలో  ఆకట్టుకున్న వీడియో కూడా ఆకర్షణీయంగా నిలిచింది. 

చదవండి: Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలు

p>

Advertisement
 
Advertisement
Advertisement