దీపావళి పండుగ వైబ్స్ అన్నీ సెలబ్రిటీల డ్రెస్‌ల్లోనే కనిపిస్తుంది. ఈ పండుగ లుక్ కనిపించేలా ట్రెడిషనల్‌ని, ఆధునికత కలబోసిన డిజైనర్‌వేర్‌లతో క్రాకర్స్‌తో పనిలేదనేలా జిగేల్‌మని మెరుస్తుంటారు. ఈసారి దీపావళి వేడుకల్లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన తోరానీ గౌనుతో చిచ్చుబుడ్డి వెలుగులు విరజిమ్మింది.
మెరూన్ బంగారు రంగు సిల్క్ గౌనుతో అత్యంత ఆకర్షణీయంగా కనిపించింది. ఈ గౌనులో భారతీయ ఎంబ్రాయిడరీ పద్ధతులు, సాంప్రదాయ వస్త్రాల సూచనలు, వాస్తుశిల్ప ప్రభావాలు కలగలిసి ఉన్నాయి. సాంప్రదాయ పండుగ శైలిపై ఆధారపడకుండా తోరానీ సుపరిచితమైన భారతీయ డిజైన్ అంశాలను ఒద్దికగా గౌనులో రీక్రియేట్ చేసింది.
ఈ డిజైనర్‌వేర్ ప్రత్యేకతలు..
కాశ్మీరీ ఆరీ, జర్దోజీతో దాదాపు 2,200 గంటల పాటు శ్రమించి రూపొందించిన కళాఖండం. ముదురు సింధూరి రంగులో ఉన్న ఈ సిల్క్ గౌనులో కాశ్మీరీ ఆరీ, జర్దోజీ, డోరీ, మారోడీ వర్క్‌ల అద్భుతమైన కలయికతో డిజైన్ చేశారు.
ముఖ్యంగా ఈ గౌనులో ముత్యాలు, గవ్వలు, మరింత అందాన్ని ఆకృతిని అందించాయి.
ఇందులోని డిజైనింగ్ టెక్నిక్ దుస్తులను పొరలు పొరలుగా కనిపించేలా చేసింది.
ఇందులో ఉపయోగించిన గవ్వలు తన సింధీ మూలాలకు నిదర్శనమని తెలిపారు.
ఈ సందర్భోచిత దుస్తుల వెనుక సమయం, నైపుణ్యం గురించి తెలిస్తే కంగుతింటారు. ఎందుకంటే ఈ గౌను డిజైనింగ్‌కే ఏకంగా 2,200 గంటలు పైనే పట్టిందట.
అలాగే భారతీయ వాస్తు వారసత్వం నుంచి ఝరోఖాలు, పాత కోటలు, సాంప్రదాయ ప్రాంగణాలను ప్రేరణగా తీసుకుని డిజైన్ చేశారు.
ఈ గౌను ముందు భాగానని పక్షులు, పువ్వులు, ఆకాశం నుంచి ప్రేరణ పొందిన అంశాలతో కూడిని ఎంబ్రాయిడరీ తోటగా డిజైన్ చేశారని చెప్పొచ్చు.
ట్రెడిషనల్‌గా యథాతథంగా క్రియేట్ చేయకుండా..పండు దుస్తులకు అర్థంపట్టేలా మన కళా వారసత్వాన్ని చాటేలా చక్కగా సమస్త వివరాలను పొందుపర్చేలా డిజైన్ చేయడం విశేషం.
దీనికి జాలువారే కుచ్చులు, గజ్జలను జోడించి గౌను కదలికలను మరింత అందంగా, లక్ష్మీ దేవి రాకకు చిహ్నంగా కనిపించేలా రూపొందించడం విశేషం.
కాగా, ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్, కుమార్తెతో కలిసి దీపావళి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఆమె భర్త నిక్ కూడా కుర్తాకి ఎంబ్రాయిడరీ చేసిన జాకిట్‌ని జోడించి మరింత పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు.
ఇదీ చదవండి: చేతులకు సంకెళ్లు వేసుకుని 101 కిలోమీటర్ల పరుగు..! చిన్నారులకు ప్రేరణగా..


