దేవాలయంలోని మూర్తిని ఎలా దర్శించాలి ? | How To Worship The Deity In A Temple? Srila Prabhupada Explains The Power Of Hare Krishna Maha Mantra | Sakshi
Sakshi News home page

దేవాలయంలోని మూర్తిని ఎలా దర్శించాలి ?

Nov 12 2026 5:19 PM | Updated on Nov 12 2026 5:22 PM

Devotion: How to have darshan of the deity in a temple

దేవాలయంలోని మూర్తిని ఎలా దర్శించాలో ప్రపంచవ్యాప్త హరే కృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారు ఈ విధంగా వివరించారు. ‘‘భక్తి–సందర్భ అను గ్రంథంలో ఆచార్య శ్రీల జీవ గోస్వాముల వారు భక్తిమార్గంలో నున్న నిష్టా గరిష్టులైన భక్తులు మట్టి, లోహం, రాయి లేదా చెక్కతో చేసిన భగవంతుని అర్చా రూపానికి, భగవంతునికి స్వయం రూపానికి మధ్య ఎటువంటి భేదం చూపరని అంటారు. 

భౌతిక ప్రపంచంలో ఒక వ్యక్తి, అతనికి సంబంధించిన ఛాయాచిత్రం లేదా విగ్రహం మధ్య భేదం వుంటుంది. అవి వ్యక్తితో భిన్నమైనవి. కానీ, సర్వ సంపూర్ణుడైన భగవంతుని విషయంలో మాత్రం స్వామికి, స్వామి వార్ల అర్చామూర్తులకు ఎటువంటి భేదమూ లేదు’ ఒక భక్తుడు స్వామివార్ల మూర్తికి ఏదైనా నివేదిస్తే అది సాక్షాత్తు స్వామికి నివేదించినట్టే. అలా భగవంతునికి అర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా భక్తుడు సకల దుఃఖాల నుండి ఉపశమనాన్ని పొందుతాడు. 

ఈ యుగంలో భగవంతుడిని ఏ మంత్రంతో అర్చించవచ్చు ?
పైన వివరించినట్లుగా, భగవంతుడు తన సంకల్పమాత్రముచే ఏ రూపంలోనైనా లోకంలో అవతరిస్తాడు. ప్రస్తుత యుగంలో భగవంతుడు శబ్ద రూపంలో అవతరిస్తాడని వేదశాస్త్రాలు వివరిస్తున్నాయి. భగవన్నామ సంకీర్తనలోని ఆ దివ్య శబ్దప్రకంపనలే భగవంతుని స్వరూపం: 

హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ, రామ రామ హరే హరే 

ప్రతిరోజూ ఈ మహామంత్రాన్ని జపించడమే ఈ యుగానికి నిర్దేశించబడిన అర్చా విధానం.
– శ్రీమాన్‌ సత్యగౌర చంద్ర స్వామీ మహరాజ్, 
హరే కృష్ణ మూవ్‌మెంట్, హైదరాబాద్‌  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement