చరిత్రనే మలుపు తిప్పిన ప్రసంగం ప్రతి..! అన్ని కోట్లు పలుకుతుందా.. | Handwritten Draft Of Martin Luther King Jrs I Have A Dream Speech | Sakshi
Sakshi News home page

చరిత్రనే మలుపు తిప్పిన ప్రసంగం ప్రతి..! అన్ని కోట్లు పలుకుతుందా..

Nov 12 2026 4:51 PM | Updated on Nov 12 2026 4:59 PM

Handwritten Draft Of Martin Luther King Jrs I Have A Dream Speech

ప్రముఖ నాయకుల ప్రసంగాల గొప్పదనం తెలిపే ప్రతిలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఆనాటికి నేటికి కూడా ఎంతో అపురూపమైనవి, శక్తమంతవైనవిగా నిలిచాయి. అలాగే చారిత్రక ప్రసంగాలకు ప్రసిద్ధి చెందాయి. అలాంటి వాటిలో ఒకటి వెలుగులోకి వచ్చింది. అది చరిత్ర గతినే మార్చి..ఆలోచింపచేసి..సమానత్వం దిశగా అడుగులు వేసేలా చేసిన ప్రతి. దాని గొప్పదనం నేటికి అజరామరం. పైగా ఆ ప్రసంగం వేలంలో ఎంత ధర పలకనుందో తెలిస్తే విస్తుపోతారు. 

అది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ రాసిన 'ఐ హావ్ ఏ డ్రీమ్' అనే చేతిరాత ప్రసంగం. ఎంతోకాలంగా అదృశ్యమైందని అనుకున్న ఏడుపేజీల చేతిరాత ఇటీవలే వెలుగులోకి వచ్చింది. అమెరికన్ పౌర హక్కుల ఉద్యమంలో అత్యంత ప్రముఖ నాయకులలో ఒకరైన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1963 ఆగస్టు 28న లింకన్ మెమోరియల్ వద్ద గుమిగూడిన 2,50,000 మందికి పైగా నిరసనకారుల సమక్షంలో ఈ చారిత్రాత్మక ప్రసంగాన్ని చేశారు. 

అయితే ఈ ప్రసంగానికి ముందు రాత్రి హోటల్‌ గదిలో కూర్చొని..పసుపురంగు నోట​్‌ప్యాడ్‌పై కొన్ని విషయాలను రాసుకున్నాడు. ఆ తర్వాత అనేక సవరణలు, తొలగింపులతో ఎంతో జాగ్రత్తగా సునిశితంగా, సృజనాత్మకంగా రాసుకున్నారో ఆ ప్రతిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇది ఆయన కెరీర్‌లోనే అత్యంత కీలకమైన ప్రసంగంగా పేరుతెచ్చుకుంది. ఈ ఏడు పేజీల పత్రం మరుసటి రోజు ఉదయం టైపింగ్‌ కోసం పంపక  ముందే తుది ముసాయిదాకు సంబంధించిన ఏకైక ప్రతి అది. ఆయన తెల్లవారుజామున మూడు లేదా నాలుగు గంటల వరకు ఈ ప్రసంగంలోని పదాలను మెరుగుపరుస్తూనే ఉన్నారట. 

ఈ పేజిలో కొన్ని పదాలు, కొన్ని పూర్తి వాక్యాలను పెన్నుతో కొట్టివేసి తిరిగి రాసిన విధం అందుకు నిదర్శనం. ఈ ముసాయితా అట్లాంటా, చికాగో, న్యూయార్క్‌ నగరాల్లో ప్రదర్శించబడుతుంది. ఆ తర్వాత జనరవి 22,2027న వేలం వేయనున్నారు. ఈ వేలం ద్వారా సుమారు రూ. 93.9 కోట్ల రూపాయల ధర పలికే అవకాశం ఉందని చెబుతున్నారు నిర్వాహకులు.  

ఈ ప్రతిని గుర్తించింది ఎవరంటే..
ఈ ప్రసంగం ప్రతి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వద్ద ప్రసంగ రచయితగా, సలహాదారుగా పనిచేసిన ఎడ్వర్డ్ టి. క్లేటన్ పత్రాల మధ్య లభ్యమైంది. ఎడ్వర్డ్ భార్య, జెర్నోనా క్లేటన్, ఒక డెస్క్‌లోని పత్రాల మధ్య "స్పీచ్" (ప్రసంగం) అని రాసి ఉన్న ఒక కవరులో ఈ పేజీలను గుర్తించారు. ఆ తర్వాతే ఆమెకు తెలిసింది అదొక ఐకానిక్‌ ప్రసంగం ప్రతి అని. 2024లో ఆ పేజీల గురించి ఫైనాన్షియల్‌ మేనేజర్‌తో పంచుకున్నారు. ఆ తర్వాత ఆయన క్రిస్టీస్ వేలం సంస్థ బృందంతో కలిసి..ప్రసిద్ధ ప్రసంగానికి సంబంధించిన చేతిరాతతో రాసిన ఏకైక తుది ముసాయిదాగా గుర్తించారు. 

అంతేగాదు తాను ఆ ప్రతిని గుర్తించినందుకు జెర్నోవా చాలా గర్విస్తోంది. ఎందుకంటే స్వేచ్ఛ, సమానత్వ సాధనను ప్రేరేపించే అమూల్యమైన ప్రసంగం తన కారణంగా ప్రపంచానికి తెలుస్తున్నందుకుని సంతోషంగా చెబుతోంది జెర్నోవా. యావత్తు ప్రపంచానికి సార్వత్రిక ప్రాముఖ్యత కలిగిన దాన్ని పరిశీలించే అదృష్టం, గౌరవం తనకు లభించాయని అంటోందామె. విశేషం ఏంటంటే ఆ ప్రసంగం ప్రతిపేరు ‘ఐ హావ్‌ ఏ డ్రీమ్‌’ కానీ అందులో తన కల ఏంటి అనేది ప్రస్తావించకుండానే ఆశువుగా ప్రసంగం సాగిపోతుంది.

ఇదీ చదవండి: ఆవేళ​ ఏడో తరగతి డ్రాపౌట్‌..కట్‌చేస్తే బ్యాంక్‌ మేనేజర్‌ టు ప్రకృతి వైద్యం!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement