చేతులకు సంకెళ్లు వేసుకుని 101 కిలోమీటర్ల పరుగు..! | Police couple runs handcuffed together for 101 km Sets Guinness Record | Sakshi
Sakshi News home page

చేతులకు సంకెళ్లు వేసుకుని 101 కిలోమీటర్ల పరుగు..! చిన్నారులకు ప్రేరణగా..

Nov 12 2026 6:04 PM | Updated on Nov 12 2026 6:18 PM

Police couple runs handcuffed together for 101 km Sets Guinness Record

ఒక జంట అసాధారణమైన రీతిలో రికార్డుని నెలకొల్పారు. అంతేగాదు సాధారణ పరుగుపందెం కాకుండా పర్వత ప్రాంతాల గుండా చేతులకు సంకెళ్లు వేసుకుని జంటగా పరుగుతీసే పందెంతో ఘనత సృష్టించారు. అంతేగాదు ఆ సవాలుకి ఒక గొప్ప అర్థాన్ని వివరించి..సహకారం విలువను తెలియజేసింది ఈ స్పెయిన్‌ జంట. ఆ దంపతులే జెస్సికా మునోజ్ పరేడెస్, పెలాయో అల్వారెజ్ రెవుయెల్టాలు. మే 9, 2026న ఈ ఘనతను సాధించారు. ఈ ఇద్దరూ చేతులకు సంకెళ్లు వేసుకుని అత్యంత దూరం పరుగెత్తి గిన్నిస్‌ రికార్డుని నెలకొల్పారు. 

46 ఏళ్ల జెస్సికా ఒక పోలీసు అధికారిణి కాగా, 40 ఏళ్ల పెలాయో స్పానిష్ సివిల్ గార్డ్‌లో పనిచేస్తున్నారు. ఈ జంటకు శారీరక సవాళ్ల పట్ల విపరీతమైన మక్కువ. ఆ ఆసక్తే వారిని ఈ అసాధారణమైన సాహసం నెలకొల్పోలే చేసింది. ఈ జంట దక్షిణ స్పెయిన్‌లోని రోండాలో స్పానిష్ సైన్యం నిర్వహించిన 101 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. పర్వత ప్రాంతాల గుండా సాగిన ఈ సవాలు క్షణాలు గడుస్తుంటే..మరింత కష్టతరంగా మారింది. 

కలిసి పరిగెత్తడానికి నిరంతర సమన్వయం, పరస్పర అవగాహన, ఒకరి కదలికలకు మరొకరు సర్దుకుపోవడం తదితరాలు ఎంతో ముఖ్యమో తెలుస్తుందని అంటోంది జెస్సికా. శారీరక పరిమితులు ఉన్నప్పటికీ ఈ పరుగుపందెంలో పాల్గొన్నారు. అయితే చాలామంది చివరి వరకు కొనసాగించలేక వైదొలగడంతో..ఈ దంపతుల గెలుపు రికార్డు సన్సెషన్‌గా నిలిచింది. అంతేగాదు తమ వృత్తి నేపథ్యాన్ని చూపించేలా సంకెళ్లు ధరించి..సహకారం అనే విలువని తెలియజేయాలనే ఈ సవాలులో పాల్గొన్నట్లు వెల్లడించారు ఆ దంపతులు. 

ఈ అనుభవాన్ని నమ్మకం, పట్టుదలకు సంబంధించిన అద్భుత పాఠంగా అభివర్ణించారు. తాము ఈ సవాలు ప్రారంభించినప్పుడు ఇద్దరు వ్యక్తులు, ఆ తర్వాత జట్టుగా మారాం..గెలిచేలా ఒకరికొకరం సహకారం అందించుకున్నాం..అది కాస్త గెలుపుకి దారితీసిందని చెబుతోంది ఈ జంట. మున్ముందు మరిన్నీ శారీరక సవాళ్లని చేపట్టాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ గెలుపు తమ పిల్లలైన యెరాయ్‌, మిరాయ్‌లను కూడా ప్రేరేపిస్తుందని సంతోషంగా చెబుతున్నారు ఈ దంపతులు.

ఇదీ చదవండి: చరిత్రనే మలుపు తిప్పిన ప్రసంగం ప్రతి..! అన్ని కోట్లు పలుకుతుందా..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement