అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను ఎగతాళి చేస్తూ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. టారిఫ్ బెదిరింపులతోనే ఔషధ ధరల విషయంలో ఫ్రాన్స్ మెడలు వంచానంటూ వ్యాఖ్యానించారు. అయితే.. తాను మాక్రాన్‌పై ఎలాంటి ఒత్తిడి చేశాననే విషయాన్ని బహిరంగంగా వివరించారు.
తాజాగా.. వాషింగ్టన్‌లో రిపబ్లికన్ సభ్యులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘అమెరికన్లు ఫ్రెంచ్ ప్రజల కంటే 14 రెట్లు ఎక్కువగా ఔషధ ధరలు చెల్లిస్తున్నారు. ఈ అసమానతను తగ్గించేందుకు ఫ్రాన్స్‌పై ఒత్తిడి చేశా. మొదట మాక్రాన్ నిరాకరించినా.. చివరికి నా డిమాండ్‌కు లొంగిపోయారు’’ అని అన్నారు. వైన్, షాంపేన్ సహా అన్నిరకాల ఫ్రెంచ్ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌ను విధిస్తానని హెచ్చరించా. ఈ బెదిరింపుతో ఫ్రెంచ్ అధ్యక్షుడు వెంటనే దిగి వచ్చారు అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
“డొనాల్డ్, మీకు డీల్ ఉంది. ఔషధ ధరలను 200 శాతం పెంచుతాను. కానీ ప్రజలకు చెప్పకండి” అని మాక్రాన్ డీల్ సెట్ చేసుకున్నారు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్ మాత్రమే కాదు.. ఇతర దేశాల నాయకులను కూడా ఇలాంటి టారిఫ్ బెదిరింపులతోనే దిగి వచ్చేలా చేశానని, కేవలం 3.2 నిమిషాలపాటు జరిగిన సంభాషణలలోనే ఔషధ ధరలను నాలుగు రెట్లు పెంచేందుకు అంగీకరించారని తెలిపారు. పైగా ఈ నిర్ణయాన్ని తాము గర్వంగా ఫీలవుతున్నామని వాళ్లు నాతో అన్నారు అని ట్రంప్ వివరించారు. అయితే వాళ్ల పేర్లను మాత్రం ఆయన ప్రస్తావించలేదు.
ఫ్రాన్స్‌లో ఈ మధ్యకాలంలో ఔషధ ధరలు 200 శాతం పెరిగాయి. దీంతో ట్రంప్ తన మోస్ట్ పేవర్డ్ నేషన్ విధానం కారణంగా.. అమెరికాలో ధరలు తగ్గుతాయని అంటున్నారు. అది ఎలాగంటే.. MFN విధానం ప్రకారం అమెరికా మెడికేర్ చెల్లింపులు ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లోని కనిష్ఠ ధరలకు అనుసంధానించబడతాయి. అలా అత్యల్ప ధర ఉన్న దేశం ధరను మాత్రమే చెల్లించేందుకు ఫెడరల్ సర్కార్ ముందుకు వస్తుంది.
ట్రంప్ ప్రకారం.. అమెరికాలో 400 నుంచి 600 శాతం మధ్య తగ్గాయట. జనవరి నుండి కొత్త వెబ్‌సైట్ TrumpRx.gov ద్వారా తగ్గిన ధరలు అందుబాటులో ఉంటాయని ఆయన అంటున్నారు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఫ్రాన్స్‌లో రాజకీయ దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే మాక్రాన్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు.
Trump mocks Macron:
Emmanuel said to me: “Donalddd, you have a deal. I would like to increase my prescription drug prices by 200% or whatever. Whatever you want, Donald, please don’t tell the population, I beg you.”
Every country said the same thing. pic.twitter.com/hrAXWkKDD3— Clash Report (@clashreport) January 6, 2026
అయితే ట్రంప్ ప్రకటనలో విరుద్ధత కనిపిస్తోంది. ఉదాహరణకు.. ఫ్రాన్స్‌లో ఔషధాల ధర $10 కనిష్ఠ ధర ఉండేది. అప్పుడు అమెరికా benchmark $10 అవుతుంది. ఫలితంగా, అమెరికా తన ధరను $100 నుండి $10కి తగ్గించుకుంటుంది. అదే ఫ్రాన్స్ ఆ తర్వాత $10 నుండి $30కి పెంచింది. జర్మనీలో ఔషధాల ధర $20గా ఉంది. అప్పుడు అమెరికా benchmark $20 అవుతుంది. ఫలితంగా, అమెరికా ధర $100 నుండి $20కి తగ్గుతుంది. అలాంటప్పుడు ఫ్రాన్స్‌పై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏముందనేది? కొందరి ప్రశ్న.


