
ఇది రికార్డుల కోసం తయారు చేసిన బుల్లి ఫోన్ కాదు. ఎంచక్కా పని చేస్తుంది. ఫ్రాన్స్ జైళ్లలో ఖైదీలు వీటిని విచ్చలవిడిగా వాడుతున్నారు. జైలు నుంచే దర్జాగా డ్రగ్ డీల్స్ మొదలుకుని కాంట్రాక్ట్ హత్యల దాకా నానా దందాలూ చక్కబెట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంపై కొన్నాళ్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫ్రెంచి జైళ్లలో నిబంధనల జాడే లేనంతగా అరాచకం రాజ్యమేలుతోందని జనం మండిపడుతున్నారు. దాంతో జైళ్లలో ఫోన్ల వాడకంపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ‘ప్రిజన్ బ్రేక్’ పేరిట మంగళవారం దేశవ్యాప్తంగా ఏకంగా 66 జైళ్లలో ఏకకాలంలో తనిఖీ ఆపరేషన్ నిర్వహించారు.
కరడుగట్టిన ఖైదీల వద్ద ఇలాంటి బుల్లి ఫోన్లు వేలాదిగా దొరకడంతో విస్తుపోయారు. కేవలం సిగరెట్ లైటర్ పరిమాణంలో ఉండే ఈ ఫోన్లన్నీ చైనా పీసులేనని విచారణలో తేలడం విశేషం! ఆపొరి్టక్ అనే ఫ్రెంచి కంపెనీ వీటిని విక్రయిస్తోంది. జైళ్లలో జరిపే ఎలాంటి ఎల్రక్టానిక్ తనిఖీలకూ ఇవి చిక్కవని వెబ్‌సైట్‌లో బాహాటంగా ప్రచారం చేసుకుంటోంది! దాంతో సదరు కంపెనీని ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టింది.