ఫ్రాన్స్‌: ఇరాన్‌ కాన్సులేట్‌లో మానవ బాంబు కలకలం | Man Threatened To Blew Himself In France Iran Consulate | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్‌: ఇరాన్‌ కాన్సులేట్‌లో మానవ బాంబు కలకలం

Apr 19 2024 7:35 PM | Updated on Apr 19 2024 9:09 PM

Man Threatened To Blew Himself In France Iran Consulate - Sakshi

ప్యారిస్‌: ఫ్రాన్స్‌ రాజధాని నగరం ప్యారిస్‌లోని ఇరాన్‌​ రాయబార కార్యాలయంలో శుక్రవారం(ఏప్రిల్‌19) మానవ బాంబు కలకలం రేగింది. ఉదయం రాయబార కార్యాలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుంటానని బెదిరించాడు. అయితే అతడిని కార్యాలయం బయటికి తీసుకువచ్చిన పోలీసులు తొలుత తనిఖీ చేశారు.

ఈ తనిఖీల్లో అతడి వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని వెల్లడైంది. అనంతరం అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఇరాన్‌ రాయబార కార్యాలయాన్ని పూర్తిగా చుట్టుముట్టారు. కాగా, ప్రస్తుతం ఇరాన్‌, ఇజ్రాయెల్‌ దేశాల మధ్య యుద్ధ వాతావారణం నెలకొన్న విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి.. ఇరాన్‌లో భారీ పేలుళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement