
ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 (Cannes 2025) లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela ) తన అద్భుతమైన ప్రదర్శనతో తన మాయాజాలాన్ని మరోసారి రిపీట్ చేసింది. తనదైన ఫ్యాషన్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసే ఊర్వశి రౌతేలా ఫ్రాన్స్ లోని కేన్స్ నగరంలో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తళుక్కుమని మెరిసింది. కొంతకాలంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను మిస్ కాని ఊర్వశి ఈసారి కూడా స్పెషల్ అప్పియరెన్స్‌తో అదరగొట్టేసింది. డార్క్ గ్రీన్ ట్యాబ్ గౌను, ధరించి యువరాణి లుక్‌లో తళుక్కుమంది. మరీ ముఖ్యగా ఆమెధరించిన ప్యారెట్ ఆకారంలో క్రిస్టల్ క్లచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో దాని ధర ఎంత అనే చర్చ నెట్టింట సందడిగా మారింది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 78వ ఎడిషన్ మే 13, 2025న ప్రారంభమై మే 24, 2025న ముగియనుంది. అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రఖ్యాత వ్యక్తులు 12 రోజుల పాటు జరిగే గ్లామర్, కళల అద్భుతమైన వేడుకలో సందడి చేయనున్నారు. బాలీవుడ్ హీరోయిన్లతోపాటు, ఈ సారి 76 ఏళ్ల సిమీ గరేవాల్ కేన్స్ ఉత్సవంలో అరంగేట్రం చేస్తోంది.. ఈ సంవత్సరం కేన్స్ ముఖ్యాంశాలలో ఒకటి, అమెరికన్ నట దిగ్గజం, రాబర్ డి నీరోకు జీవిత సాఫల్యానికి గౌరవ పామ్ డి'ఓర్ అవార్డును ప్రదానం చేయడం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ఉర్వశి రౌతేలా రెడ్ కార్పెట్ మీద నడిచింది.
ఇదీ చదవండి: 76 ఏళ్ల వయసులో 56 ఏళ్ల తరువాత కేన్స్‌లో అరంగేట్రం..అస్సలు ఊహించలేదు
ఊర్వశి ధరించిన గౌనుతో పాటు, రంగురంగుల రత్నాలు, చెవిపోగులు, రంగురాళ్ల కిరీటం మరింత ఆకర్షణీయంగా నిలిచాయి. ఇక మేకప్ విషయానికి వస్తే, ముదురు ఊదా రంగు ఐషాడోతో బోల్డ్, గ్లామరస్ మేకప్, కళ్ళపై రైన్‌స్టోన్స్ స్టిక్కర్‌తో తన మరింత ఎలివేట్ చేసుకుంది. పక్షి ఆకారంలో ఉన్న బ్యాగును పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ పోజులివ్వడంతో నెటిజన్లు ఫిదా అయిపోయారు. కేన్స్‌లో చిలుకలా దుస్తులు ధరించి వచ్చిన తొలి మహిళ, ఇది నిజమా; లేక ఏఐ మాయాజాలమా అంటూ ఆశ్చర్యంలో మునిగి పోయారు.

హైలైట్ ఏంటంటే
ఊర్వశి లుక్‌లో మరో హైలైట్ ఆమె క్లచ్. సాధారణ, ప్రాథమిక క్లచ్‌లను పక్కనపెట్టి, జుడిత్ లిబర్ డిజైనర్ క్రిస్టల్ చిలుక క్లచ్‌ను ఎంచుకుంది.అద్భుతమైన క్లచ్ ధర 5,495 US డాలర్లు అంటే దాదాపు రూ. 4,57,744లు.
గతంలో ఊర్వశి రౌతేలా క్రొకోడైల్ నెక్ పీస్ ధరించి పలువుర్ని ఆకర్షించింది. 2023 కేన్స్‌లో రూ. 200 కోట్ల విలువైన నకిలీ మొసలి నెక్‌పీస్ ధరించిన సంగతి తెలిసిందే. ఆ ఏడాది సిమా కౌచర్ రూపొందించిన పింక్ టల్లే గౌనులో ఆమె కేన్స్ రెడ్ కార్పెట్‌పై తొలి సారి తన బ్యూటీని ప్రపంచానికి చాటా చెప్పింది.