
2025 లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ (2025 Cannes Film Festival)లో అరంగేట్రం చేసేందుకు అలనాటి అందాల సుందరి సిద్ధమవుతోంది. ఆమె మరెవ్వరో కాదు ప్రఖ్యాత నటి, దర్శకురాలు, నిర్మాత, టాక్ షో హోస్ట్ సిమీ గరేవాల్ (Simi Garewal). అద్భుతమైన నటనతో బాలీవుడ్‌లో పాపులర్ నటిగా కొనసాగింది. దో బదన్, రాజ్ కపూర్‌తో మేరా నామ్ జోకర్, అరణ్యర్ దిన్ రాత్రి, పదాతిక్ వంటి చిత్రాలలో తన నటనా నైపుణ్యానికి ప్రశంసలందుకుంది. అంతేకాదు రెండెజౌస్ విత్ సిమి గరేవాల్, సిమి సెలెక్ట్స్ ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్, ఇట్స్ ఎ ఉమెన్స్ వరల్డ్ వంటి కార్యక్రమాలకు హోస్ట్‌గా కూడా తన ప్రత్యేకతను చాటుకుంది.
తాజాగా ఈ అందాల సుందరి సిమీ గరేవాల్ తనకెంతో ఇష్టమైనతెల్లని దుస్తుల్లో మెరిసేందుకు సిద్ధమవుతోంది. 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరంగేట్రం చేయనుంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో సిమీ ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సిమీ సందడినిచూసేందుకు ఎదురు చూస్తున్నారు.
‘‘56 సంవత్సరాల తరువాత ఈ సినిమా నన్ను కేన్స్‌లో రెడ్ కార్పెట్‌పైకి తీసుకెళ్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. నేను చాలా ధన్యురాల్ని’’ అంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో సంతోషం వెలిబుచ్చారు.
ఇక్కడ సిమి నటించిన, లెజెండరీ ఫిల్మ్ మేకర్ సత్యజిత్ రే 'అరణ్యర్ దిన్ రాత్రి' అప్‌డేటెడ్ వెర్షన్ ప్రదర్శించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె రెడ్ కార్పెట్ పై నడవనుంది. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో, సిమీ గరేవాల్ రెడ్ కార్పెట్‌పై తాను ధరించబోయే దుస్తుల వీడియోను పోస్ట్ చేసింది. కార్లియో ఫ్యాషన్ బ్రాండ్ నుండి దుస్తులను పరిశీలిస్తున్న క్లిప్‌ను షేర్ చేసింది. నటి తెల్లటి టోన్డ్ షర్ట్ , ప్యాంటులో చాలా అందంగా, సింపుల్ మృదువైన మేకప్, కళ్ళజోడు, ఓపెన్ హెయిర్ ఆమె లుక్‌కు మరింత సొబగులద్దాయి. ఈ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ డ్రెస్‌లో అద్భుతంగా కనిపిస్తారని తెలుసు.", "ఆ అందమైన తెల్లని గౌనుకు మరెవరూ న్యాయం చేయలేరు." "మీరు గ్రేస్ బ్యూటీ & డిగ్నిటీకి నిదర్వనం. అంటూ ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు అందించారు.

చదవండి: తల్లిని పోగొట్టుకున్న రెండేళ్ల చిన్నారితో..ఎంత కష్టం : డెలివరీ ఏజెంట్ స్టోరీ
1970 నాటి బాలీవుడ్ 'అరణ్యర్ దిన్ రాత్రి’ చిత్రాన్ని వెస్ ఆండర్సన్ , మార్టిన్ స్కోర్సెస్ అప్‌డేట్ వెర్షన్‌గా తీసుకొచ్చారు. ఈ 4K వెర్షన్‌ను కేన్స్ 2025 ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నట్లు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సునీల్ గంగోపాధ్యాయ రాసిన నవల ఆధారంగా సత్యజిత్ రే 1970లో నిర్మించిన అడ్వెంచర్ డ్రామా చిత్రం. ఈ చిత్రం 20వ బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ బేర్‌కు నామినేట్ అయింది.ఈ చిత్రంలో సిమీగరేవాల్, సౌమిత్ర ఛటర్జీ, షర్మిలా ఠాగూర్ , రబీ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు.

చదవండి: కదులుతున్న కారుపై కొత్త జంట విన్యాసాలు, వైరల్ వీడియో