Cannes 2025: పొడవాటి గౌను ధరించి షాకిచ్చిన హీరో! | Cannes 2025: Jonathan Guilherme breaks Rules With Very Raunchy Outfit | Sakshi
Sakshi News home page

Cannes 2025: పొడవాటి గౌను ధరించి షాకిచ్చిన హీరో.. రూల్స్‌ బ్రేక్‌!

May 20 2025 12:19 PM | Updated on May 20 2025 12:23 PM

Cannes 2025: Jonathan Guilherme breaks Rules With Very Raunchy Outfit

కాన్స్‌ చిత్రోత్సవాల్లో నిబంధన ఉల్లంఘన  

 ‘నో న్యూడిటీ’... ఈసారి కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులు స్ట్రిక్ట్‌గా పెట్టిన నిబంధన ఇది. ఈ నిబంధనను అనుసరించి తారలు తమ దుస్తులను డిజైన్‌ చేయించుకున్నారు. కానీ, నటుడు జొనాథన్‌ గిల్హెర్మ్‌ మాత్రం ఈ నిబంధనను ఉల్లంఘించారు. జొనాథన్‌ నటించిన ‘ఐ ఓన్లీ రెస్ట్‌ ఇన్‌ ది స్ట్రామ్‌’ కాన్స్‌ చిత్రోత్సవాల్లో ‘అన్‌ సర్టైన్‌ రిగార్డ్‌’ విభాగంలో పోటీకి ఎంపికైంది. ఈ సినిమా స్క్రీనింగ్‌ కోసం చిత్రబృందంలోని కొందరితో కలిసి జొనాథన్‌ కాన్స్‌ ఉత్సవాలకు హాజరు అయ్యారు. 

తొలిసారి తాను ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నానని పేర్కొన్నారు జొనాథన్‌. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఓ పొడవాటి గౌను ధరించి, ప్రత్యక్షమయ్యారాయన. పైగా వెనక భాగం మోకాళ్ల పై వరకూ కనిపించేలా, ఆ గౌను చూడ్డానికి ఇబ్బందికరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ‘నో న్యూడిటీ నిబంధనను ఇలా ఉల్లంఘించాడేంటి’ అనే చర్చ జరిగింది. అయితే ఈ ఫెస్టివల్‌ నిర్వాహకులు జొనాథన్‌ ప్రదర్శనపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కనిపించలేదు. ఇక ఈ నటుడు ధరించిన రెండో డ్రెస్‌ కూడా వెరైటీగా ఉంది. ఎండు ఆకులను తలపించేలా ఓ డ్రెస్‌ వేసుకున్నారు. అంతే కాదు... ఏకంగా బెంచ్‌ మీద కూర్చుని ఫొటోలకు ΄ోజులిచ్చారు. ఇక ‘ఐ ఓన్లీ రెస్ట్‌ ఇన్‌ ది స్ట్రామ్‌’ విషయానికొస్తే... తెల్లవాడిగా ఉండటం వల్ల పశ్చిమ ఆఫ్రికాలో కలిగే కష్టాలను అధిగమించడానికి ప్రయత్నించే ఓ ΄ోర్చుగీస్‌ పర్యావరణ ఇంజనీర్‌ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ ΄ోర్చుగీస్‌ చిత్రంలో జొనాథన్‌ గిల్హెర్మ్‌ ఓ విచిత్రమైన బ్రెజిలియన్‌ వ్యక్తి ΄ాత్ర ΄ోషించారు. అందుకే కాన్స్‌కు విచిత్రమైన వస్త్రధారణలో హాజరై ఉంటారేమో! 

తన్వీ ది గ్రేట్‌కి ప్రశంసలు 
బాలీవుడ్‌ నటుడు–దర్శకుడు అనుపమ్‌ ఖేర్‌ దర్శకత్వం వహించిన ‘తన్వీ ది గ్రేట్‌’ చిత్రం కాన్స్‌ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కాగా, మంచి ప్రశంసలు లభించాయి. ‘‘పలు దేశాలకు చెందినవారు మా సినిమా చూసి, అభినందించారు. వారి స్పందన చూసి, కదిలిపోయా’’ అని పేర్కొని, ఈ చిత్రాన్ని జూలై 18న రిలీజ్‌ చేయనున్నట్లుగా అనుపమ్‌ ఖేర్‌ పేర్కొన్నారు. ఆర్మీలో చేరే తన్వీ అనే స్పెషల్‌ గర్ల్‌ చుట్టూ తిరిగే కథతో రూపొందిన ఈ చిత్రంలో తన్వీగా శుభాంగి దత్‌ నటిం చారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర కూడా పోషించారు. ఇక ఈ నెల 13న కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆరంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 24 వరకూ ఈ ఫెస్టివల్‌ జరుగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement