Cannes 2025
-
Cannes 2025: పొడవాటి గౌను ధరించి షాకిచ్చిన హీరో!
‘నో న్యూడిటీ’... ఈసారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు స్ట్రిక్ట్‌గా పెట్టిన నిబంధన ఇది. ఈ నిబంధనను అనుసరించి తారలు తమ దుస్తులను డిజైన్ చేయించుకున్నారు. కానీ, నటుడు జొనాథన్ గిల్హెర్మ్ మాత్రం ఈ నిబంధనను ఉల్లంఘించారు. జొనాథన్ నటించిన ‘ఐ ఓన్లీ రెస్ట్ ఇన్ ది స్ట్రామ్’ కాన్స్ చిత్రోత్సవాల్లో ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగంలో పోటీకి ఎంపికైంది. ఈ సినిమా స్క్రీనింగ్ కోసం చిత్రబృందంలోని కొందరితో కలిసి జొనాథన్ కాన్స్ ఉత్సవాలకు హాజరు అయ్యారు. తొలిసారి తాను ఈ ఫెస్టివల్లో పాల్గొంటున్నానని పేర్కొన్నారు జొనాథన్. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఓ పొడవాటి గౌను ధరించి, ప్రత్యక్షమయ్యారాయన. పైగా వెనక భాగం మోకాళ్ల పై వరకూ కనిపించేలా, ఆ గౌను చూడ్డానికి ఇబ్బందికరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ‘నో న్యూడిటీ నిబంధనను ఇలా ఉల్లంఘించాడేంటి’ అనే చర్చ జరిగింది. అయితే ఈ ఫెస్టివల్ నిర్వాహకులు జొనాథన్ ప్రదర్శనపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కనిపించలేదు. ఇక ఈ నటుడు ధరించిన రెండో డ్రెస్ కూడా వెరైటీగా ఉంది. ఎండు ఆకులను తలపించేలా ఓ డ్రెస్ వేసుకున్నారు. అంతే కాదు... ఏకంగా బెంచ్ మీద కూర్చుని ఫొటోలకు ΄ోజులిచ్చారు. ఇక ‘ఐ ఓన్లీ రెస్ట్ ఇన్ ది స్ట్రామ్’ విషయానికొస్తే... తెల్లవాడిగా ఉండటం వల్ల పశ్చిమ ఆఫ్రికాలో కలిగే కష్టాలను అధిగమించడానికి ప్రయత్నించే ఓ ΄ోర్చుగీస్ పర్యావరణ ఇంజనీర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ ΄ోర్చుగీస్ చిత్రంలో జొనాథన్ గిల్హెర్మ్ ఓ విచిత్రమైన బ్రెజిలియన్ వ్యక్తి ΄ాత్ర ΄ోషించారు. అందుకే కాన్స్‌కు విచిత్రమైన వస్త్రధారణలో హాజరై ఉంటారేమో! తన్వీ ది గ్రేట్‌కి ప్రశంసలు బాలీవుడ్ నటుడు–దర్శకుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన ‘తన్వీ ది గ్రేట్’ చిత్రం కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కాగా, మంచి ప్రశంసలు లభించాయి. ‘‘పలు దేశాలకు చెందినవారు మా సినిమా చూసి, అభినందించారు. వారి స్పందన చూసి, కదిలిపోయా’’ అని పేర్కొని, ఈ చిత్రాన్ని జూలై 18న రిలీజ్ చేయనున్నట్లుగా అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు. ఆర్మీలో చేరే తన్వీ అనే స్పెషల్ గర్ల్ చుట్టూ తిరిగే కథతో రూపొందిన ఈ చిత్రంలో తన్వీగా శుభాంగి దత్ నటిం చారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర కూడా పోషించారు. ఇక ఈ నెల 13న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆరంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 24 వరకూ ఈ ఫెస్టివల్ జరుగుతుంది. -
Cannes 2025: నిజమైన జుట్టుతో ఫ్రాక్.. స్పెషల్ అట్రాక్షన్‌గా పారుల్
ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఫ్రాన్స్‌లో జరిగే కాన్స్ చిత్రోత్సవాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఈ వేడుకల్లో పాల్గొనే తారలు ప్రత్యేక దుస్తుల్లో ప్రత్యక్షమై కనువిందు చేస్తుంటారు. ప్రస్తుతం జరుగుతున్న 78వ కాన్స్ చిత్రోత్సవాల్లో ఇప్పటికే పలువురు నటీమణులు అదిరేటి డ్రెస్సుల్లో ఆకట్టుకోగా... తాజాగా మరికొందరు రెడ్ కార్పెట్‌పై మెరిశారు. భారతదేశం నుంచి ఈ చిత్రోత్సవాల్లో పాల్గొన్న అనుష్కా సేన్ పర్పుల్ ఫ్రాక్‌లో కలర్ఫుల్గా కనిపించారు. ‘దేవోం కే దేవ్.... మహాదేవ్, బాలవీర్, ఝాన్సీ కీ రాణి’ తదితర షోస్‌లో నటించిన అనుష్కా సేన్ భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ‘నమస్తే’ అంటూ, అక్కడున్న వారికి అభివాదం చేయడం దేశం పట్ల ఆమెకున్న గౌరవానికి నిదర్శనంగా నిలిచింది. ఇక ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్న అనుపమ్ ఖేర్ దర్శకత్వంలో రూపొందిన ‘తన్వీ ది గ్రేట్’లో నటించిన శుభాంగి దత్ మల్లెపువ్వుల తాజాదనాన్ని గుర్తు చేస్తూ తెల్లటి గౌనులో ఫ్రెష్‌గా కనిపించారు. అలాగే పలు పంజాబీ చిత్రాల్లోనూ, ఒక తెలుగు చిత్రం (‘నీ జత లేక’), పలు హిందీ సీరియల్స్, టీవీ షోస్‌లో నటించిన పారుల్ గులాటి నిజమైన జుట్టుతో తయారు చేసిన ఫ్రాక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ న్యాన్సీ త్యాగి స్వయంగా తానే తయారు చేసుకున్న గౌనులో, మ్యూజిక్ సెన్సేషన్ ఆస్టా గిల్ బంగారు రంగు గౌనులో మెరిసిపోయారు. ఇంకా హాలీవుడ్ తారలు ఏంజెలినా జోలి, ఎమ్మా స్టోన్ తదితరులు రెడ్ కార్పెట్ పై ఐ ఫీస్ట్‌గా నిలిచారు.అమెరికన్ కాంటెంపరరీ వెస్ట్రన్ ఫిల్మ్ ‘ఎడింగ్టన్’ స్పెషల్ ప్రీమియర్ కాన్స్‌లో ఓ హైలైట్‌గా నిలిచింది. ఆరి ఆస్టర్ డైరెక్షన్లో జోక్విన్ ఫీనిక్స్ (‘జోకర్’ సినిమా ఫేమ్), పెడ్రో ఫాస్కల్, ల్యూక్ గ్రిమ్స్, డీర్ర్డే ఓ కానల్, మైఖేల్ వార్డ్, ఆస్టిన్ బట్లర్, ఎమ్మా స్టోన్ ప్రధాన ΄ాత్రలు ΄ోషించారు. ఈ ‘ఎడింగ్టన్’ టీమ్ రెడ్ కార్సెట్ వాక్ చేసినప్పుడు ఓ గమ్మతైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఈగ ఎమ్మా స్టోన్ చూట్టూ తిరిగింది. ఆ ఈగను చూసి, ఎమ్మో స్టోన్ కొన్ని సరదా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, ఆమె పక్కనే ఉన్న పెడ్రో ΄ాస్కల్–ఆస్టిన్ బట్లర్లు ఆ ఈగను తోలడం వంటివి వీక్షకులను అలరించాయి. అలాగే ఈ ప్రీమియర్ తర్వాత ఈ సినిమాకు ఐదు నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. ఈ మూవీ జూలై 18న అమెరికాలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రీమియర్‌కు ఏంజెలినా జోలీ హాజరవ్వడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. -
కాపీ కొట్టావ్.. చిలుక బ్యాగ్, ఊర్వశీ రౌతేలా లుక్‌పై ట్రోలింగ్!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి క్రమం తప్పకుండా హాజరయ్యే హీరోయిన్లలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela) ఒకరు. ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes 2025) ప్రారంభమైన తొలి రోజే సందడి చేసింది ఈ అందాల తార. మల్టీ కలర్ పొడవాటి గౌనుతో పాటు జుడిత్ లీబర్ డిజైన్ చేసిన చిలుక ఆకారంలోని క్రిస్టల్ ఎంబెడెడ్ క్లచ్ బ్యాగ్‌ను ధరించి..రెడ్ కార్పెట్‌పై హొలలొలికించింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కొంతమంది నెటిజన్స్ ఊర్వశీ లుక్‌పై విమర్శలు చేస్తున్నారు. ఐశ్వర్యరాయ్ లుక్‌ని కాపీ కొట్టిందంటూ ఆమె లుక్‌ని ట్రోల్ చేస్తున్నారు. 2018లో ఐశ్వర్యరాయ్ కూడా ఇలాంటి డ్రెస్‌నే ధరించి కేన్స్ ఫెస్టివల్‌కు హాజరైయిందని, అంత కరిష్మా లేకున్నా ఊర్శశీ కూడా ఆమెను అనుకరించిందని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఆమె ధరించిన డ్రెస్ అతిగా, విచిత్రంగా ఉందని, మేకప్ ఎక్కువైందని ట్రోల్ చేస్తున్నారు.కేన్స్ ఫెస్టివల్ కోసం నిర్వాహకులు ప్రవేశపెట్టిన డ్రెస్ కోడ్ రూల్స్‌లో అతిగా బహిర్గతమయ్యే దుస్తులను ధరించరాదని చెప్పినప్పటికీ, ఊర్వశీ లుక్ ఈ సరిహద్దులను పరీక్షించినట్లు కనిపించింది. ఆమె ధరించిన డ్రెస్ కంటే.. చేతిలో ఉన్న చిలుక బ్యాగ్ అందరిని ఆకట్టుకుంది. దీని ధర సుమారు రూ.4 లక్షలు ఉంటుందట. గతంలో కూడా ఊర్వశీ ఇలా ఖరీదైన వస్తువులను, అభరణాలను ఫిల్మ్ పెస్టివల్‌లో ప్రదర్శించింది. 2023లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌కి రూ. 276 కోట్ల విలువ చేసే మొసలి నెక్లెస్‌ని ధరించింది. అప్పట్లో ఈ నెక్లెస్‌పై కూడా విమర్శలు వచ్చాయి.