
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి క్రమం తప్పకుండా హాజరయ్యే హీరోయిన్లలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela) ఒకరు. ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes 2025) ప్రారంభమైన తొలి రోజే సందడి చేసింది ఈ అందాల తార. మల్టీ కలర్ పొడవాటి గౌనుతో పాటు జుడిత్ లీబర్ డిజైన్ చేసిన చిలుక ఆకారంలోని క్రిస్టల్ ఎంబెడెడ్ క్లచ్ బ్యాగ్‌ను ధరించి..రెడ్ కార్పెట్‌పై హొలలొలికించింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
కొంతమంది నెటిజన్స్ ఊర్వశీ లుక్‌పై విమర్శలు చేస్తున్నారు. ఐశ్వర్యరాయ్ లుక్‌ని కాపీ కొట్టిందంటూ ఆమె లుక్‌ని ట్రోల్ చేస్తున్నారు. 2018లో ఐశ్వర్యరాయ్ కూడా ఇలాంటి డ్రెస్‌నే ధరించి కేన్స్ ఫెస్టివల్‌కు హాజరైయిందని, అంత కరిష్మా లేకున్నా ఊర్శశీ కూడా ఆమెను అనుకరించిందని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఆమె ధరించిన డ్రెస్ అతిగా, విచిత్రంగా ఉందని, మేకప్ ఎక్కువైందని ట్రోల్ చేస్తున్నారు.
కేన్స్ ఫెస్టివల్ కోసం నిర్వాహకులు ప్రవేశపెట్టిన డ్రెస్ కోడ్ రూల్స్‌లో అతిగా బహిర్గతమయ్యే దుస్తులను ధరించరాదని చెప్పినప్పటికీ, ఊర్వశీ లుక్ ఈ సరిహద్దులను పరీక్షించినట్లు కనిపించింది. ఆమె ధరించిన డ్రెస్ కంటే.. చేతిలో ఉన్న చిలుక బ్యాగ్ అందరిని ఆకట్టుకుంది. దీని ధర సుమారు రూ.4 లక్షలు ఉంటుందట. గతంలో కూడా ఊర్వశీ ఇలా ఖరీదైన వస్తువులను, అభరణాలను ఫిల్మ్ పెస్టివల్‌లో ప్రదర్శించింది. 2023లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌కి రూ. 276 కోట్ల విలువ చేసే మొసలి నెక్లెస్‌ని ధరించింది. అప్పట్లో ఈ నెక్లెస్‌పై కూడా విమర్శలు వచ్చాయి.