
రావణాసురుడు కొంటెవాడే కానీ రాక్షసుడు కాదంటోంది బాలీవుడ్ సీనియర్ నటి సిమి గరేవాల్. దసరా పండగనాడు రావణుడి బొమ్మను దహనం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ప్రతి ఏడాది దసరా రోజు చెడుపై మంచి సాధించిన విజయాన్ని పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ రావణా.. నువ్వు కాస్త కొంటెగా ఉన్నావే తప్ప రాక్షసుడిలా ప్రవర్తించలేదు. కొంటెతనం తప్ప అంతకుమించి ఏ తప్పూ చేయలేదు.
తిండి పెట్టావ్
తొందరపడి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశావు. ఈ కాలంలో ఆడవాళ్లకు ఇస్తున్న గౌరవమర్యాదలతో పోలిస్తే అప్పట్లో నువ్వే ఒక స్త్రీ(సీతాదేవి)ని ఎంతో గౌరవించావు. ఆమెకు మంచి తిండి, ఆశ్రయం కల్పించావు. తన భద్రత కోసం మహిళా సెక్యూరిటీ గార్డులను నియమించావు(వాళ్లు అందంగా లేరనుకో..). పార్లమెంటులో ఉన్న సగం మంది సభ్యులకంటే కూడా నువ్వే ఎక్కువ చదువుకున్నావు.

ట్వీట్ డిలీట్
రావణుడి బొమ్మను కాల్చడానికి నాకెటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆయనేం చేశారన్నదే నా ప్రశ్న.. అంతే! హ్యాపీ దసరా అని ట్వీట్ చేసింది. ఈ పోస్ట్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో సదరు ట్వీట్‌ను డిలీట్ చేసింది. కాగా సిమి గరేవాల్.. దో బడాన్, మేరా నామ్ జోకర్, కర్జ్ వంటి సినిమాల్లో నటించింది. యాంకర్‌గా టాక్ షోలు కూడా చేసింది. కొన్ని సీరియల్స్, సినిమాలకు డైరెక్టర్‌గానూ వ్యవహరించింది.
చదవండి: తప్పు లేకపోయినా దివ్య కాళ్లు మొక్కిన మాస్క్ మ్యాన్..