కదులుతున్న కారుపై కొత్త జంట విన్యాసాలు, వైరల్‌ వీడియో | Gwalior newlywed couple performed a risky dance: Viral video | Sakshi
Sakshi News home page

కదులుతున్న కారుపై కొత్త జంట విన్యాసాలు, వైరల్‌ వీడియో

May 13 2025 12:13 PM | Updated on May 13 2025 3:09 PM

Gwalior newlywed couple performed a risky dance: Viral video

సోషల్ మీడియా  మోజు అనేక  ప్రమాదాలకు దారి తీస్తున్నప్పటికీ  సోషల్‌మీడియాపై క్రేజ్‌ పోవడం లేదు.   కొంతమంది యువతీ యువకులు  సోషల్‌ మీడియా  లైక్స్‌, కమెంట్స్‌ కోసం  ఎంతటికైనా దిగజారడానికి సిద్ధపడిపోతున్నారు.  తాజాగా కదులుతున్న కారుపై వధువు,వరుడు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై  కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.  చివరికి ఏమైందో తెలియాలంటే ఈ కథనం  చదవాల్సిందే..

జీవితంలో అంత్యం సంతోషకరమైన క్షణాలను పదిలంగా దాచుకోవాల్సిందే.  తమసంతోషాన్ని నలుగురితో పంచుకోవడంలో తప్పులేదు.  కానీ లేనిపోని,  పిచ్చి పిచ్చి సాహసాల వలన స్వయంగా  కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవడమే కాదు, ఒక్కోసారి సహచరులకు ముప్పుగా పరిణమిస్తుంది. సరదా పేరుతో  తెలివితక్కువతో  చేసే పనులపై ఇటీవలి కాలంలో  చాలా ఆందోళన వ్యక్తమవుతోంది.వివాహ వేడుక  తరువాత ఒక నూతన జంట ప్రమాదకరంగా డ్యాన్స్‌ చేసి వైరల్‌గా మారారు.  ఆ తరువాత చిక్కుల్లో పడ్డారు.

చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో

 

గ్వాలియర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వరుడు గర్వంగా కారు పైకప్పుపై నృత్యం చేశాడు. అక్కడితో ఆగలేదు..  కత్తిని గాలిలో తిప్పుతూ దర్పాన్ని ప్రదర్శించాడు. ఇక నేనేం  తక్కువ అన్నట్టు, పెళ్లిదుస్తుల్లోనే  వధువు కూడా బోనెట్ మీద కూర్చుని ​ స్టెప్పులేయడం మొదలు పెట్టింది. సల్మాన్ ఖాన్ నటించిన నో ఎంట్రీ  బాలీవుడ్‌ చిత్రంలోని  ‘ఇష్క్ కి గలి విచ్ నో ఎంట్రీ’ పాటకుఉత్సాహంగా గెంతులేశారు. కొత్త రైల్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో రద్దీగా ఉండే రోడ్డుపై  జరిగిన ఉదందాన్ని చూసి నెటిజన్లు  దిగ్భ్రాంతికి  లోనయ్యారు.  కామన్‌ సెన్స్‌ లేదంటూ తిట్టిపోస్తున్నారు.

 ఈ  షాకింగ్‌ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు  రంగంలోకి దిగారు. గ్వాలియర్ ట్రాఫిక్ పోలీసులు కారును ట్రాక్ చేసి  ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు చలానా జారీ చేశారు. గోలా కా మందిర్ ట్రాఫిక్ స్టేషన్‌కు చెందిన సుబేదార్ అభిషేక్ రఘువంశీ  దీన్ని ధృవీకరించారు. దంపతులకు, ఇతర ప్రయాణికులకు ప్రమాదం ఉందని , విచారణ అనంతరం మరిన్ని జరిమానాలు విధించే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.

ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement