రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర | Queen of ayurveda Forest Essentials founder Mira Kulkarni success story | Sakshi
Sakshi News home page

రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర

May 12 2025 12:49 PM | Updated on May 12 2025 3:35 PM

Queen of ayurveda Forest Essentials founder Mira Kulkarni success story

భళా ఆయుర్వేదం

ఆయుర్వేదం అనగానే ముందుగా గుర్తొచ్చేది భారతదేశం. ఆయుర్వేదం అనగానే గుర్తొచ్చే బిజినెస్‌ దిగ్గజం మీరా కులకర్ణి. బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన  అనేక మంది పురుష గాథల మధ్య  ఆమె విజయం నిజంగా చాలా స్పూర్తిదాయకం. కేవలం  రూ. 2 లక్షల పెట్టుబడితో వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఘనత, దార్శనికత  ఆమె సొంతం. ఆమె మరెవ్వరో కాదు  ప్రపంచ బ్యూటీ ఇండస్ట్రీలో రారాణిలా వెలుగుగొందుతున్న భారతీయ మహిళ మీరా కులకర్ణి. పదండి  మీరా కులకర్ణి  విజయగాథ గురించి తెలుసుకుందాం.

ఉత్తరాంచల్‌లోని తెహ్రీ గర్హ్వాల్ ప్రాంతానికి చెందిన మీరాకు చాలా చిన్నతనంలోనే ఆయుర్వేద జీవన విదానంపై ఆసక్తి పెరిగింది. అచంచలమైన అంకితభావం  ఆయుర్వేదంపై ఉన్న మక్కువతో ఉత్తరాఖండ్‌కు చెందిన  ఆమె సంప్రదాయ మార్గాలను ధిక్కరించి మరీ బిలియన్‌ డాలర్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. సక్సెస్‌కు సరిహద్దులు లేవని  నిరూపించారు.

ఫారెస్ట్ ఎస్సెన్షియల్స్ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ డైరెక్టర్ 69 ఏళ్ల మీరా కులకర్ణి ఇపుడు గ్లోబల్‌ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. స్వచ్ఛమైన ఆయుర్వేద చర్మ, జుట్టు సంరక్షణ ఉత్పత్తులను తయారు చేయాలనే  లక్ష్యంతో భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యూటీ, వ్యక్తిగత సంరక్షణ పరిశ్రమలో బలమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. డిజిటల్‌ మార్కెట్లోకూడా ఉనికిని చాటుకుంటూ,  అంతర్జాతీయ మార్కెట్లనుమరింతగా ఆకర్షించాలని భావిస్తున్నారు. “ప్రపంచవ్యాప్తంగా ఎదగడం, ప్రపంచంలోని ఏదైనా ఉత్తమ బ్రాండ్‌తో భారతీయ బ్రాండ్‌ను పోల్చదగినదిగా చేయడమే తదుపరి లక్ష్యం.” అని ఆమె చెప్పారు. 

ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
 

ఒక విలాసవంతమైన ఆయుర్వేద ఉత్పత్తులను తీసుకురావడం అనేది ఒక విప్లవాత్మక ఆలోచన అంటారామె. వ్యాపారంలో ఎలాంటి అనుభవం, విజ్ఞానం లేకపోయినా 40 ఏళ్ల వయసులో,  సింగల్‌ పేరెంట్‌గా కష్టాలుపడుతున్న క్రమంలో  2000 సంవత్సరంలో  కేవలం రూ. 2 లక్షల పెట్టుబడి, ఇద్దరు ఉద్యోగులతో ఒక చిన్న గ్యారేజ్‌లో ఫారెస్ట్ ఎసెన్షియల్స్‌ను వ్యాపారాన్ని ప్రారంభించారు. ఎలాంటి రుణం తీసుకోకుండా, వచ్చిన లాభాలను తిరిగి పెట్టుబడులు పెడుతూ  నెమ్మదిగా వృద్ధి చెందారు. అయితే ఈ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. ఆయుర్వేదంపై ఉన్న ప్రేమ, కష్టపడి పనిచేయడం, కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోవడమే ఆమెకున్న బలాలు. దీంతోపాటు మార్కెట్లో లభించే ఆయుర్వేద ఉత్పత్తులు చాలావరకు నాణ్యత లేనివి , ఎక్కువగా ఔషధపరమైనవనే విషయాన్నే  త్వరగా ఆకళింపు చేసుకున్నారు.

ఇదీ చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్‌స్పైరింగ్ జర్నీ

మలుపు తిప్పిన  అనుకోని మీటింగ్‌ 
ఫారెస్ట్ ఎసెన్షియల్స్ క్రమంగా తన ఉత్పత్తుల శ్రేణిని విస్తరించింది. సాంప్రదాయ, విలాసవంతమైన ఆయుర్వేద చర్మ సంరక్షణ బ్రాండ్‌కు ప్రసిద్ధి చెందిన బ్రాండగా ఎదిగింది. భారతదేశంలోని చాలా లగ్జరీ హోటల్ చైన్లు ,స్పాలకు ప్రముఖ సరఫరాదారుగా కూడా అవతరించింది. భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో పాపులర్‌ అయింది. రాజీలేని నాణ్యతకు మరోపేరుగా నిలిచింది.

2007లో జోధ్‌పూర్‌లోని ఒక ప్యాలెస్‌లో ఎలిజబెత్ హర్లీ , భారతీయ వ్యాపార దిగ్గజం అరుణ్ నాయర్ వివాహానికి భారతదేశానికి వచ్చిన సమయంలో అనూహ్యంగా ఎస్టీ లాడర్ చైర్మన్ లియోనార్డ్ లాడర్‌తో జరిగిన సమావేశం కులకర్ణి వ్యవస్థాపక ప్రయాణంలో ఒక ప్రధాన మలుపుగా నిలిచింది. ఈ మీటింగ్‌లో చర్చల  రెండు నెలల తర్వాత  మీరా బ్రాండ్‌లో ఎస్టీ లాడర్ ఫారెస్ట్ ఎస్సెన్షియల్స్‌లో  భారీ పెట్టుబడులు పెట్టింది. అంతే అక్కడినుంచి  వెనుదిరిగి చూసింది లేదు. రాజీలేని నాణ్యతతో ప్రచార ఆర్భాటాలు, డిస్కైంట్ల జిమ్మిక్కులు ఇలాంటి వాటి జోలికి పోకుండా  దూసుకుపోయింది. ప్రపంచ వ్యాప్తంగా  ఆయుర్వేద ఉత్పతులతో గ్లోబల్‌ బిజినెస్‌ లీడర్‌గా దాదాపు రూ.8, 500 కోట్ల ప్రపంచ అందాల సామ్రాజ్యానికి అధిపతి వరకు సాగిన ఆమె వ్యాపార ‍ప్రస్థానం  ఎందరో మహిళా వ్యాపారవేత్తలకు  స్ఫూర్తినిస్తోంది.

మీరా కులకర్ణి విద్యార్హతలు
మీరా కులకర్ణి చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాల నుండి ఫైన్ ఆర్ట్స్‌లో పట్టభద్రురాలు. భారతదేశ ఆయుర్వేద కేంద్రంగా పిలువబడే ఉత్తరాంచల్‌లోని తెహ్రీ గర్హ్వాల్ ప్రాంతానికి చెందిన మీరా, ఆయుర్వేద జీవన విధానంతోపాటు, అంతేకాకుండా, పెయింటింగ్, జర్నలిజం, వాటర్ కలర్స్, ఆర్గానిక్ మొక్కలు, మూలికలు, వైద్య ఫలితాలపై ఆమెకున్న విభిన్న ఆసక్తే ఆమెను విజయవంతమైన వ్యవస్థాపకురాలిగా మామర్చిం దనడంలో ఎలాంటి సందేహం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement