
భార్యాభర్తల్లో ఒకరు చనిపోయినపుడు మిగిలిన భాగస్వాముల జీవితం దుర్భరమే అవుతుంది. అయితే చాలా సందర్భాల్లో భార్య చనిపోయినపుడు భర్త రెండోపెళ్లి చేసుకోవడం, ఇంటి బాధ్యతలతోపాటు, మొదటి భార్య సంతానాన్ని పెంచే బాధ్యత కూడా రెండో భార్యకు అప్పగించడం లాంటివి చూస్తాం.కానీ స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసే వ్యక్తి ఇందుకు భిన్నం. తన రెండేళ్ల కూతురిని చూసుకుంటూ డెలివరీలు చేస్తున్న కథనం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వేలాది మంది హృదయాలను కదిలించింది.
గురుగ్రామ్‌కు చెందిన స్విగ్గీ డెలివరీ ఏజెంట్ పంకజ్. భార్య చనిపోయిన తరువాత తన తన రెండేళ్ల కుమార్తె టున్ టున్ తల్లిలేని బిడ్డగా మారిపోయింది. కానీ పంకజ్ బిడ్డను ఒంటరిగా వదిలేయలేదు. స్వయంగా తనే తన పాపాయిని చూసుకుంటున్నాడు. టున్‌టున్‌ను వెంటబెట్టుకుని మరీ డెలివరీలు చేస్తున్నాడు. ఆమెను చూసుకోవడానికి మరెవరూ లేకపోవడం, పెద్ద కొడుకుసాయంత్రం తరగతులకు హాజరుకావడంతో పంకజ్‌కు మరే మార్గం కనిపించలేదు.
ఇదీ చదవండి: కదులుతున్న కారుపై కొత్త జంట విన్యాసాలు, వైరల్ వీడియో
గురుగ్రామ్‌కు చెందిన సీఈవో మయాంక్ అగర్వాల్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో డెలివరీ ఏజెంట్ పంకజ్ వెలుగులోకి వచ్చాడు.మయాంక్ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత డెలివరీ ఏజెంట్ పంకజ్‌కు కాల్ చేయగా.. అవతలినుంచి ఒక చిన్నారి వాయిస్ కూడా వినిపించడంతో, పైకి రమ్మని చెబుతామని కూడా ఆగిపోయి, స్వయంగా తానే కిందికి వెళ్లాడు. అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. బైక్‌పై ఫుడ్ డెలివరీ ఏజెంట్ పంకజ్‌తో పాటు అతని రెండేళ్ల పాపాపయి కూడా. దీంతో పంకజ్‌ను ఆరా తీసి, అసలు సంగతి తెసుకుని మయాంక్ భావోద్వేగానికి లోనయ్యాడు.తన అనుభవాన్ని మయాంక్ లింక్డ్ ఇన్‌లో షేర్ చేశాడు.
అసలేం జరిగిందంటే
డెలివరీ ఏజెంట్‌గా చేస్తున్న పంకజ్‌కు ఇద్దరు పిల్లలు. రెండో బిడ్డ టున్ టున్ పుట్టగానే భార్య కాన్పు సమయంలో చనిపోయింది. అప్పటినుంచి అన్నీ తానై అయ్యి బిడ్డలను సాదుకుంటున్నాడు. కొడుకు కాస్త పెద్దవాడు కావడంతో అతన్ని సాయంత్రంపూట ట్యూషన్లకు పంపుతున్నారు. కూతురు చిన్నది కావడంతో తనతోపాటే తీసుకెళ్లి, బైకు మీద కూర్చో బెట్టుకొని స్విగ్గీలో డెలివరీ ఏజెంట్ విధులను నిర్వరిస్తున్నాడు. ఇది చాలా రిస్క్‌తో కూడినదే కానీ కానీ పనిచేయకపోతే బతుకు దెరువు కష్టం కదా అన్న పంకజ్ మాటలు పలువుర్ని ఆలోచింప చేస్తున్నాయి. చాలా రిస్క్ బాస్ అంటూ కొందరు విమర్శిస్తుండగా, శభాష్, హాట్సాఫ్ పంకజ్ అంటూ మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే గిగ్ వర్కర్ల కనిపించని కష్టాలు అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.ఇంకొందరు అతనికి సాయం చేసేందుకు ముందుకు వస్తుండటం విశేషం.