ఫ్రాన్స్‌ సంచలన ఆరోపణలు.. చైనా, పాక్‌లు కలిసి..! | China And Pakistan Behind Anti-Rafale Jets Campaign? Check Out Full Story Inside | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్‌ సంచలన ఆరోపణలు.. చైనా, పాక్‌లు కలిసి..!

Jul 6 2025 6:48 PM | Updated on Jul 7 2025 3:24 PM

China behind anti-Rafale jets campaign

తమ యుద్ధ విమానాల అమ్మకాలపై చైనా దుష్ర్పచారాం చేస్తోందని ప్రాన్స్‌ సంచలన ఆరోపణలు చేసింది. తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తున్న రఫెల్‌ యుద్ధ విమానాల అమ్మకాలను చైనా దెబ్బతీస్తోందని ఫ్రాన్స్‌ ఆరోపించింది. పలు దేశాల్లో చైనా రాయబార కార్యాలయాల్లో పని నేసే దౌత్య, రక్షణ ప్రతినిధులు ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారని ఫ్రాన్స్‌ మండిపడుతోంది. 

ఫేల్ విమానాలను కొనుగోలు చేయవద్దని, వాటి స్థానంలో చైనా తయారీ జెట్లను తీసుకుంటే మంచిదని వివిధ దేశాలను ఒప్పించే యత్నాలు జరగుఉతున్నాయని ఫ్రెంచ్‌ వర్గాల వెల్లడించాయి.  తమ దేశం అధికంగా విమానాల అమ్మకాలనై అత్యధికంగా ఆధారపడిన దేశమని, దాన్ని చైనా దెబ్బ కొట్టడానికి తీవ్ర యత్నాలు చేస్తున్నట్లు ప్రాన్స్‌ చెబుతోంది. చైనా తన అధికారిక బలంతో ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు ఫ్రాన్స్‌ అంటోంది. పాకిస్తాన్‌, చైనా కలిసి ఈ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఫ్రాన్స్‌ విమర్శించింది. 

ఈ దుష్ప్రచారంలో భాగంగా, గత మే నెలలో భారత్‌తో జరిగిన ఘర్షణలో మూడు రఫేల్ విమానాలతో సహా ఐదు భారత విమానాలను కూల్చివేశామని పాకిస్తాన్‌ చేసిన వాదనలను చైనా వాడుకుంటోందని ఫ్రాన్స్‌ అధికారులు తెలిపారు. 

ఆన్‌లైన్‌లో కూడా ఈ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారని తెలిపింది. ఏఐతో మార్ఫింగ్‌ చేసిన యుద్ధ విమానాల శిథిలాలను చూపిస్తూ చైనా టెక్నాలజీ అమోఘమనే భావనను వారు కల్గిస్తున్నారని తెలిపింది. రఫెల్‌ అనేది యుద్ధ విమానం మాత్రమే కాదని, అది ఫ్రాన్స్‌ వ్యూహాత్మక సామర్థ్యానికి, నమ్మకానికి ప్రతీక ఫ్రాన్స్‌ పేర్కొంది. ఇప్పుడే దాన్నే చైనా తన అధికారిక బలాన్న ఉపయోగించి దుష్ప్రచారానికి దిగినట్లు ఫ్రాన్స్‌ ధ్వజమెత్తింది.

రఫెల్‌ యుద్ధ విమానాలకు తయారు చేసే డసెల్ట్‌ ఏవియేషన్‌ 533 జెట్స్‌ను వివిద దేశాలకు అమ్మింది. ఈజిప్ట్‌, భారత్‌, ఖతర్‌, గ్రీస్‌, క్రొయేషియా, యూఏఈ, సెర్బియా,  ఇండోనేషియా తదితర దేశాలకు ఫ్రాన్స్‌ తమ యుద్ధ విమానాలను విక్రయించింద. ఇప్పటివరకూ ఇండోనేషియా 42 యుద్ధ విమానాలను ఫ్రాన్స్‌ నుండి కొనుగోలు చేయగా, మరిన్ని రఫెల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడాన్ని పరిశీలిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement