వందేళ్ల ఫ్రాన్స్‌ బామ్మగారికి పద్మశ్రీ!

100 Year Old Yoga Exponent Charlotte Chopin Recived Padma Shri - Sakshi

యోగా అనేది మన దేశానికి చెందినది. అయితే మన దేశంలో కూడా అంతలా శ్రద్ధగా చేసేవాళ్లు తక్కువే. యోగా చేస్తున్న అతి పెద్ద వయసు వృద్ధులు లేరు కూడా. కానీ ఫ్రాన్స్‌కి చెందిన ఓ బామ్మ మాత్రం అతి పెద్ద వయసు యోగా టీచర్‌. ఆమె ఫ్రాన్స్‌లో యోగా విప్లవాన్నే తీసుకొచ్చి ఎనలేని కృషి చేసింది. అందుకుగానే భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్న పురస్కారం ఆమెను పద్శ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నలుగురు ఫ్రెంచ్‌ జాతీయులకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. వారిలో ఈ బామ్మ కూడా ఉన్నారు. 

గతేడాది ఫ్రాన్స్‌ బాస్టిల్‌ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లినప్పుడూ తొలిసారిగా పారిస్‌లో షార్లెట్‌ చాపిన్‌ను కలిశారు. ఆమె చాలా చురుకుగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఇంత పెద్దావిడి అంతలా ఎలా చలాకీగా ఉన్నారని ఆరా తీశారు మోదీ. అప్పుడే తెలిసింది మోదీకి ఆమె ఒక యోగా గురవని. ఈ విషయాన్నే ఆయన మనకీబాత్‌లో ప్రస్తావిస్తూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ చాపిన్‌ ఈ యోగా విద్య ఎలా నేర్చుకుందో వింటే ఆశ్చర్యపోతారు. ఆమెకు ఏడేళ్ల వయసులో భారత్‌కు వచ్చినప్పుడూ ఈ యోగా విద్య గురించి తెలిసుకుందంట. అక్కడ కొందరూ మగపిల్లలు ఈ యోగాసనాలు వేయడం చూసి, తాను అలా వేయగలనా? అని మనసులోనే అనుకుందట ఆ బామ్మ.

అయితే ఆమె తర్వాత ఫ్రాన్స్‌ వెళ్లిపోవడంతో...ఆ ఆసనాల సంగతి మర్చిపోయి బాల్‌ రూమ్‌ డ్యాన్సర్‌గా కెరియర్‌ని మొదలుపెట్టింది. ఈ డ్యాన్స్‌ని చేసేటప్పుడు అయిన గాయాల వల్ల మూడుసార్లు హిప్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీలను చేయించుకుంది. వాటి నుంచి  కోలుకొనే క్రమంలోనే చిన్నప్పుడు తాను చూసిన యోగాని తిరిగి 50 ఏళ్ల వయసులో మొదలుపెట్టారు. ‘అప్పట్నుంచీ యోగమార్గమే నా జీవితం అయ్యింది. యాభై ఏళ్లుగా నేను చేస్తూ, ఎంతో మందితో చేయిస్తున్నా. లెక్కల ప్రకారం చూస్తే  నాకిప్పుడు వందేళ్లు. కానీ పాతికేళ్లే అనుకుంటారు. యోగావల్లనే ఆ హుషారు, ఉత్సాహం’ అనే చాపిన్‌ ఫ్రాన్స్‌లో ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతున్నారు.

అంతేగాదు ఆమె పలు టీవీ షోలు కూడా చేస్తున్నారు. ఈ యోగాసనాలతో గిన్నిస్‌ రికార్డునీ కూడా సొంతం చేసుకున్నారు.  వయసు మీరడం వల్ల ఆమె మాట ముద్దగా ఉంటుందేమో కానీ... ఆమె వేసే యోగాసనాల్లో మాత్రం వణుకూ లేకపోవడం విశేషం. ఇక మోదీ ఆమెను చూసి యోగా కేవలం పశ్చిమ దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక ఇతర ‍ప్రాంతాలకు చేరుకుంటుంది. అది కేవలం షార్లెట్‌ వంటి వారి కృషి వల్లే జరుగుతుందంటూ ఆ బామ్మపై పొగడ్తల వర్షం కురిపించారు మోదీ. 

(చదవండి: ఇంజనీరింగ్‌ రంగంలో అత్యంత సంపన్న మహిళ..ఏకంగా 30 వేల కోట్ల..)

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top