భారత్‌పై మరోసారి విషం కక్కిన ట్రంప్‌ | China India Hellhole: Trump Shares Post On US Birthright Citizenship | Sakshi
Sakshi News home page

భారత్‌పై మరోసారి విషం కక్కిన ట్రంప్‌

Apr 23 2026 1:33 PM | Updated on Apr 23 2026 2:09 PM

China India Hellhole: Trump Shares Post On US Birthright Citizenship

వాషింగ్టన్: వలసల విషయంలో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి విద్వేషం వెళ్లగక్కారు. భారత్‌ను నరకంతో పోల్చిన ఓ లెటర్‌ను ట్రంప్‌ షేర్‌చేశారు. ఇండియా, చైనా దేశాలను అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్.. న‌ర‌క‌కూపాలతో పోల్చగా.. ఆయ‌న రాసిన‌ ఓ లేఖ‌ను ట్రంప్ త‌న ట్రుత్ సోష‌ల్ పోస్టులో షేర్ చేశారు. జ‌న్మ‌హ‌క్కు పౌర‌స‌త్వం గురించి మైఖేల్ సావేజ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ట్రంప్ స‌మ‌ర్థిస్తూ ఆ పోస్టు షేర్‌ చేశారు.

ఇండియా, చైనా దేశాలను న‌ర‌క‌కూపాలు అభివర్ణిస్తూ.. ఆ రెండు ఆసియా దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌జ‌లు.. అమెరికాలో 9 నెల‌ల్లో ఓ బిడ్డ‌ను కనేస్తారు. ఇక చ‌ట్టం ప్ర‌కారం వాళ్లు త‌క్ష‌ణ‌మే అమెరికా పౌరులు అవుతారంటూ సావేజ్ త‌న లేఖ‌లో విమ‌ర్శలు గుప్పించారు. ఆ జాత్యహంకార లేఖ‌ను ట్రంప్ త‌న సోష‌ల్ మీడియా పోస్టులో షేర్ చేయ‌డం వివాదాస్ప‌దంగా మారింది. పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై చేస్తున్న వాదనలను విమర్శిస్తూ సావేజ్ రాసిన లేఖతో పాటు వీడియోను కూడా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్నారు.

ఇక్కడ జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం ఇచ్చే విధానంపై సావేజ్ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో కోర్టులకు వదిలేయకుండా జాతీయ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆయన కోరారు. అంతేకాకుండా భారత్‌, చైనా వలసదారులు ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లు.. వీళ్లు మనల్ని దోచుకున్నారు. ఈ గ్యాంగ్‌స్టర్లు అమెరికాలో పుట్టిన తమ బిడ్డల ద్వారా పౌరసత్వం పొంది.. మొత్తం కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. మనల్ని రెండో తరగతి పౌరులుగా చూశారు’’ అంటూ సావేజ్ రాసుకొచ్చారు. అమెరికా జెండాను భారతీయులు తొక్కేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement