బెంగాల్‌లో కాంగ్రెస్ ఒంటరి పోరు.. తొలి జాబితా ఇదే | Bengal Polls: Congress Releases First List Of 284 Candidates | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో 284 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా

Mar 30 2026 2:05 PM | Updated on Mar 30 2026 2:11 PM

Bengal Polls: Congress Releases First List Of 284 Candidates

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఒంటరిగా దిగుతున్న కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం ఏకంగా 284 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసింది. అసెంబ్లీలోని మొత్తం 294 సీట్లకు ఏప్రిల్‌ 23, 29వ తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనుండటం తెల్సిందే.

ఈ జాబితాలో పార్టీ రాష్ట్ర మాజీ చీఫ్‌ ఆధిర్‌ రంజన్‌ చౌదరి, బహరంపూర్‌ నుంచి టీఎంసీ మాజీ ఎంపీ మౌసమ్‌ నూర్‌ మాలతిపూర్‌ నుంచి పోటీకి దిగనున్నారు. కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే, అగ్ర నేత రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు బెంగాల్‌ సీనియర్‌ నేతలతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ జాబితాను ఖరారు చేశారు.

 

మూడో ఓటరు లిస్ట్ బెంగాల్లో ప్రచురించిన ఈసీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) అనంతరం మూడో అదనపు ఓటరు జాబితాను ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. శనివారం రాత్రి 11.30 గంటలకు ప్రచురించిన ఈ జాబితాలో బూత్‌లవారీ వివరాలున్నాయి.

అయితే ఇందులో కూడా తొలగించిన, కొత్తగా చేర్చిన పేర్ల సంఖ్యను వెల్లడించలేదు! సోమవారం తొలి అదనపు జాబితాను, శుక్రవారం రాత్రి రెండో జాబితాను ఈసీ విడుదల చేయడం తెలిసిందే. 

చ‌ద‌వండి: దీదీ 'చేప‌'ల‌కు మోదీ గాలం?

Advertisement
 
Advertisement
Advertisement