అల్లరిమూకలపై డేగ కన్ను  | Seven districts under ECI special security scanner in WestBengal Elections | Sakshi
Sakshi News home page

అల్లరిమూకలపై డేగ కన్ను 

Apr 23 2026 5:52 AM | Updated on Apr 23 2026 5:52 AM

Seven districts under ECI special security scanner in WestBengal Elections

వెయ్యి మందితో ఈసీ ప్రత్యేక జాబితా 

వీరిలో 9 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు 

హైకోర్టును ఆశ్రయించిన అధికార పార్టీ 

సాక్షి, న్యూఢిల్లీ: బెంగాల్‌లో తొలి దశ పోలింగ్‌ సందర్భంగా సమస్యలు సృష్టించే వారు, అల్లరి మూకలను కట్టడి చేయడంపై ఈసీ దృష్టిపెట్టింది. ఇలాంటి వారితో కూడిన వెయ్యిమంది జాబితాను సిద్ధం చేసింది. ఇందులో 9మంది వరకు తృణమూల్‌ ఎమ్మెల్యేలున్నారు. పలువురు అభ్యర్థులు, కౌన్సిలర్లు ఉన్నారు. వీరిపై పోలీసు నిఘా పెరిగింది. ఈ జాబితాపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. 

తమ నాయకులను ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికే ఈ ప్రయత్నమని ఆరోపించింది. దీనిపై టీఎంసీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. నిర్దిష్ట ఆధారాలు లేకుండా రాజకీయ నాయకులను సమస్యాత్మక వ్యక్తులుగా గుర్తించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన సమయంలో ఈ జాబితా వెలుగులోకి రావడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement