226 స్థానాల్లో గెలుస్తాం | Mamata Banerjee rejected the exit polls, claims TMC will win 226 seats | Sakshi
Sakshi News home page

226 స్థానాల్లో గెలుస్తాం

May 1 2026 2:33 AM | Updated on May 1 2026 2:33 AM

Mamata Banerjee rejected the exit polls, claims TMC will win 226 seats

మమత ధీమా 

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికల్లో తాము 226కు పైగా సీట్లలో విజయం సాధిస్తామని టీఎంసీ చీఫ్, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. వివిధ సంస్థలు చేపట్టిన ఎగ్జిట్‌ పోల్స్‌ వెనుక బీజేపీ హస్తముందని, వాటిని తాము విశ్వసించలేమని ఆమె తెలిపారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలతో తమ కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కాషాయ పార్టీ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. 

షేర్‌ మార్కెట్‌ను నిలకడగా ఉంచేందుకు బీజేపీ నేతలు చేసిన చిట్టచివరి ప్రయత్నం ఎగ్జిట్‌పోల్స్‌ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు గురువారం సీఎం మమత సోషల్‌మీడియాలో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్‌ చేశారు. బీజేపీ కార్యాలయం నుంచి వచి్చన ఆదేశాల మేరకే టీవీ చానళ్లలో ఎన్నికల ఫలితాలపై ముందస్తు అంచనాలు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. 

బెంగాల్‌ అసెంబ్లీలోని 294 స్థానాల్లో బీజేపీ మెజారిటీ సాధించనుందంటూ బుధవారం వెలువడిన మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ జోస్యం చెప్పడం తెల్సిందే. ‘బీజేపీ కార్యాలయం నుంచి 1.08 గంటలకు వచి్చన ఆదేశాల ప్రకారమే టీవీ చానళ్లు చూపించాయి. అదంతా ప్రసారమయ్యేలా వాళ్లకు డబ్బు అందింది. దీనిపై నా వద్ద కచి్చతమైన సమాచారముంది. తాము చెప్పినట్లే చూపించాలని బీజేపీ నేతలు చానళ్లపై ఒత్తిడి తెచ్చారు’అని మమత ఆరోపించారు. ‘226కు పైగా సీట్లను గెల్చుకుంటాం. 230 వరకు కూడా రావచ్చు. ప్రజల తిరుగులేని తీర్పు             మాపక్షానే ఉంటుంది’ అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement