బెంగాల్‌: ముగిసిన తుది విడత పోలింగ్ | West Bengal Election Eight Phase Polling Updates | Sakshi
Sakshi News home page

బెంగాల్‌: ముగిసిన తుది విడత పోలింగ్

Apr 29 2021 7:01 AM | Updated on Apr 29 2021 8:01 PM

West Bengal Election Eight Phase Polling Updates - Sakshi

► బెంగాల్ లో నేడు జరుగుతున్న తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటల వరకు 76.07 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 

బీభం: 81.82 శాతం

కోల్‌కతా నార్త్: 57.85 శాతం

మాల్డా: 79.98 శాతం

ముర్షిదాబాద్: 78.09 శాతం

 బెంగాల్ తుది విడత పోలింగ్ ‌లో భాగంగా నేడు జరుగుతున్న ఎన్నికల్లో సా.5.30 గంటల వరకు 76.07 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 

► బెంగాల్ తుది విడత పోలింగ్ ‌లో భాగంగా నేడు జరుగుతున్న ఎన్నికల్లో మధ్యాహ్నం 3గంటల వరకు 68.66 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

మాల్డా: 70.85%
ముర్షిదాబాద్: 70.91%
కోల్‌కతా: 51.40%
బీభం: 73.92%

బెంగాల్‌లో చివరి విడత ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 11 వరకు 37.80 శాతం పోలింగ్ నమోదైంది.ఓటర్లు ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రాలకు భారీగా తరలి వస్తున్నారు.

  ఉదయం 9:30 వరకు 16.04 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్‌ కొనసాగుతోంది. నటుడు మిథున్‌ చక్రవర్తి ఉత్తర​ కోల్‌కతాలోని కాశిపూర్-బెల్గాచియా పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుక్నురు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను ఇంత ప్రశాంతంగా గతం‍లో ఎప్పుడూ ఓటు వేయలేదని తెలిపారు. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చివరి విడత పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 11,680 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆఖరి విడత ఎన్నికల బరిలో 283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాస్క్‌లు, సానిటైజర్లు పోలింగ్‌ కేంద్రాల ముందు ఏర్పాటు చేశారు. బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి.
చదవండి: లాక్‌డౌన్‌ ఉంది ఎలా బతకాలి?.. 'ఆకలితో చస్తే.. చావు'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement