దీదీ నాలుగోసారి సీఎం అవుతారా? | West Bengal Elections Results Today | Sakshi
Sakshi News home page

దీదీ నాలుగోసారి సీఎం అవుతారా?

May 4 2026 6:52 AM | Updated on May 4 2026 8:30 AM

West Bengal Elections Results Today

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరికాసేపట్లో కౌంటింగ్‌ షురూ కానుంది. మొత్తం 294 స్థానాలు ఉన్న బెంగాల్‌ అసెంబ్లీలో అధికారం కైవసం చేసుకోవడానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 148. ఒక్క ఫాల్తా తప్ప అన్ని ఫలితాలు ఇవాళ వెలువడతాయి. ఆ నియోజకవర్గంలో 24న ఉప ఎన్నిక జరగనుంది. మిగిలిన 293 స్థానాల ఓట్ల కౌంటింగ్‌ కోసం 77 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.  

బెంగాల్‌ ఫలితాలను అటు ఢిల్లీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నుడూలేని విధంగా ఈసారి భారీగా పోలింగ్‌ నమోదు కావడం ఇందుకు మరో కారణం. టీఎంసీ, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. నాలుగోసారి మమతా బెనర్జీ  సీఎం అవుతారా?.. బెంగాల్‌లో మమతకు బీజేపీ చెక్‌ పెడుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. 

మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల తర్వాత ఈవీఎంలను లెక్కించనున్నారు. రెండు గంటల తర్వాత ట్రెండ్స్‌ వెలువడే చాన్స్‌ ఉంది. మరోవైపు కౌంటింగ్‌ హాల్‌లో సెల్‌ఫోన్లు నిషేధించారు. కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 

ఎస్‌ఐఆర్‌ తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఆసక్తి నెలకొంది. మరీ ముఖ్యంగా భవానీపూర్‌లో మమత వర్సెస్‌ అధికారి సువేందు మధ్య టఫ్‌ వార్‌ తప్పదనే అంచనాలు నెలకొన్నాయి. మొత్తంగా.. బెంగాల్‌ ఫలితాలు జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. కొద్ది గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెర పడనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement