five state assembly polls
-
దీదీ నాలుగోసారి సీఎం అవుతారా?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరికాసేపట్లో కౌంటింగ్ షురూ కానుంది. మొత్తం 294 స్థానాలు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో అధికారం కైవసం చేసుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148. ఒక్క ఫాల్తా తప్ప అన్ని ఫలితాలు ఇవాళ వెలువడతాయి. ఆ నియోజకవర్గంలో 24న ఉప ఎన్నిక జరగనుంది. మిగిలిన 293 స్థానాల ఓట్ల కౌంటింగ్ కోసం 77 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బెంగాల్ ఫలితాలను అటు ఢిల్లీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నుడూలేని విధంగా ఈసారి భారీగా పోలింగ్ నమోదు కావడం ఇందుకు మరో కారణం. టీఎంసీ, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. నాలుగోసారి మమతా బెనర్జీ సీఎం అవుతారా?.. బెంగాల్లో మమతకు బీజేపీ చెక్ పెడుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల తర్వాత ఈవీఎంలను లెక్కించనున్నారు. రెండు గంటల తర్వాత ట్రెండ్స్ వెలువడే చాన్స్ ఉంది. మరోవైపు కౌంటింగ్ హాల్లో సెల్ఫోన్లు నిషేధించారు. కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎస్ఐఆర్ తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఆసక్తి నెలకొంది. మరీ ముఖ్యంగా భవానీపూర్‌లో మమత వర్సెస్ అధికారి సువేందు మధ్య టఫ్ వార్ తప్పదనే అంచనాలు నెలకొన్నాయి. మొత్తంగా.. బెంగాల్ ఫలితాలు జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. కొద్ది గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెర పడనుంది. -
విజయ్.. మరో ఎంజీఆర్!
చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో తమిళనాడు దశాబ్దాలుగా ద్విముఖ పోరుగా మారిన రాజకీయ చదరంగంలో విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చి అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోందని యాక్సిస్ మై ఇండియా సంచలన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. బ్లాక్‌బస్టర్ సినిమాలతో సినీప్రియులను ఉర్రూతలూగించిన హీరో విజయ్ ఇకపై ముఖ్యమంత్రిగా తమిళనాడు పౌరులనూ పాలించబోతున్నారని బుధవారం ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడైంది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ తాజా ఎన్నికల్లో ఏకంగా 98 నుంచి 120 స్థానాల్లో గెలిచే వీలుందని ఎగ్జిట్‌పోల్ పేర్కొంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీ సులభంగా సాధారణ మెజారిటీని సాధిస్తుందని యాక్సిస్ మై ఇండియా ఛైర్పర్సన్ ప్రదీప్ గుప్తా చెప్పారు. ఎన్నికల తర్వాత తమిళనాడులో ఎంజీఆర్‌లా, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌లా విజయ్ సినీరంగం నుంచి వచ్చి నేరుగా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోబోతున్నారని ఎగ్జిట్ పోల్ అంచనావేసింది. అరంగేట్రం అదిరేలా.. స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పార్టీ సాధారణ మెజార్టీ కంటే తక్కువగా 92 నుంచి 110 స్థానాలకు పరిమితంకావొచ్చు. ఎన్డీఏ కూటమి 22 నుంచి 32 సీట్లు సాధించొచ్చు. టీవీకే మాత్రం విజయదుందుభి మోగించే వీలుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం...ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీ 35 శాతం ఓట్లు సాధించనుంది. టీవీకే సైతం 35 శాతం ఓట్లు సాధించనుంది. అయితే సీట్లపరంగా చూస్తే డీఎంకే కంటే టీవీకే ఎక్కువ సీట్లను గెల్చుకోనుంది. అన్నాడీఎంకే 23 శాతం ఓట్లు సాధించి 22 నుంచి 32 చోట్ల గెలిచే ఆస్కారముంది. యువ ఓటర్ల ఓట్లే కీలకం.. ఎగ్జిట్ పోల్ గణాంకాల ప్రకారం చూస్తే టీవీకే పార్టీకి యువత మద్దతు ఎక్కువగా ఉంది. → 18–19 ఏళ్ల వయసులో తొలిసారిగాఓటేసిన యువ ఓటర్లలో 68 శాతం మంది టీవీకే పార్టీకే ఓటేశామని చెప్పారు → 20–29 ఏళ్ల వయసు వారిలో 59 శాతం మంది విజయ్‌కే తమ మద్దతు అని వెల్లడించారు → 30–39 ఏళ్ల వయసు వారిలో 45 శాతం మంది టీవీకే పార్టీకే ఓటేశామని తెలిపారు → విద్యార్థులు, నిరుద్యోగులు, పట్టణ ఓటర్లలో ఏ పార్టీకి ఇంతటి మద్దతులేకపోవడం విశేషం మార్పు... అసలైన మంత్రం పాలనలో మార్పును కోరుకుంటూ ఓటేశామని 35 శాతం మంది ఓటర్లు తెలిపారు. మరీ ముఖ్యంగా డీఎంకే, అన్నాడీఎంకే విధానాలతో విసిగిపోయి మార్పు కోసమే విజయ్ వైపునకు మళ్లామని 77 శాతం మంది ఆయన మద్దతుదారులు తెలిపారు. కేవలం విజయ్ హుందాతనం, ఛరిష్మాను చూసి ఓటేశామని మరికొందరు చెప్పారు. కొత్తతరహా రాజకీయం, ప్రభుత్వ వ్యతిరేకత సైతం విజయ్‌కి కలిసిరావొచ్చని ఎగ్జిట్ పోల్ పేర్కొంది. కులాలు, మతాలకతీతంగా.. కులాలు, మతాలకతీతంగా రాష్ట్రవ్యాప్తంగా విజయ్‌కు ఓట్లేశారని ఎగ్జిట్ పోల్ అంచనావేసింది. ఓబీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, గ్రామీణ,పట్టణ ప్రాంత ఓటర్లు అందరూ టీవీకేకు పట్టం కట్టబోతున్నారని ఎగ్జిట్‌పోల్ విశ్లేషించింది. ఉపకులాల వారీగా చూసినా ఇతర పార్టీలతో పోలిస్తే విజయ్‌కు మద్దతు ఎక్కువగా కన్పించింది. ప్రచారకాలంలో పట్టణ ప్రాంతాల్లో మాత్రమే విజయ్‌కు హవా ఉన్నట్లు ప్రచారసభలకు వచ్చిన జనాలను బట్టి తెలుస్తోంది. తీరా పోలింగ్ సమయం సమీపించేనాటికి టీవీకే పట్ల అభిమానం అంతకంతకూ పల్లెలకూపాకిందని ఎగ్జిట్‌పోల్ తెలిపింది. ముఖ్యమంత్రిగానూ.. రాష్ట్రంలో తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండొచ్చనే ప్రశ్నకు ఓటర్లు విజయ్ పేరే ఎక్కువగా చెప్పారు. విజయ్ సీఎం కావొచ్చని 37 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి సీఎం కావొచ్చని 35 శాతం మంది అంచనావేశారు. తొలి ఎన్నికల్లోనే ప్రస్తుత సీఎంకు గట్టిపోటీ ఇచ్చేస్థాయికి విజయ్‌కు ప్రజాదరణ దక్కడం విశేషమని యాక్సిస్ మై ఇండియా ఛైర్పర్సన్ ప్రదీప్ గుప్తా చెప్పారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో తేలిందేంటంటే.. → ద్విముఖ పోరుగా ఉన్న తమిళనాడు ఎన్నికల్లో హఠాత్తుగా టీవీకే వచ్చి కీలకశక్తిగా మారుతోంది→ డీఎంకేకు క్షేత్రస్థాయిలో ఇప్పటికీ గట్టిపట్టున్నా ఆ పునాదులను టీవీకే పెకళించే అవకాశాలు మెండుగా ఉన్నాయి→ జయలలిత మరణం, పన్నీర్‌సెల్వం, పళనిస్వామి మధ్య విభేదాలు, పన్నీర్‌సెల్వం ని్రష్కమణ, అంతర్గత విభేదాలతో అన్నాడీఎంకే ప్రభ కోల్పోయింది→ విజయ్ పార్టీ శాశ్వతంగా రాష్ట్రరాజకీయాల్లో కీలకభూమిక పోషించే అవకాశం → తాజా ఎగ్జిట్‌పోల్ అంచనాలు నిజమైతే టీవీకే పార్టీ తమిళనాట కీలకరాజకీయ శక్తిగా ఎదుగుతుంది. భవిష్యత్తు ఎన్నికల్లోనూ కింగ్‌మేకర్‌గా మారొచ్చు. -
కాంగ్రెస్ –2, బీజేపీ–2, హంగ్–1!
న్యూఢిల్లీ: నెలన్నరకు పైగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు ముగింపునకు వచి్చంది. గురువారంతో అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మిజోరంలో నవంబర్ 7న, ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, 19 తేదీల్లో రెండు దశల్లో, మధ్యప్రదేశ్‌లో 19న, రాజస్థాన్‌లో 25న పోలింగ్ జరగడం తెలిసిందే. తెలంగాణలో కూడా గురువారం ఒకే దశలో పోలింగ్ ముగిసింది. ఐదు రాష్ట్రాల్లోనూ డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలో పోలింగ్ ముగియగానే ఐదు రాష్టాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఓడించనుందని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో అధికారం నిలబెట్టుకుంటుందని పలు పోల్స్ పేర్కొన్నాయి. ఇక కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో బీజేపీ గెలుస్తుందని చాలావరకు తేల్చాయి. మధ్యప్రదేశ్‌ను కూడా బీజేపీ నిలబెట్టుకోవచ్చని, మిజోరంలో హంగ్ రావచ్చని తెలిపాయి... మధ్యప్రదేశ్... బీజేపీకే మొగ్గు! మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఘనవిజయం సాధించనుందని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య, ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ వంటి పలు సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ సీట్లు 230. మెజారిటీ మార్కు 116 కాగా బీజేపీకి ఏకంగా 140 నుంచి 162 సీట్లు వస్తాయని ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. కాంగ్రెస్ 68 నుంచి 90 సీట్లకు పరిమితం కానుందని చెప్పింది. టుడేస్ చాణక్య కూడా బీజేపీకి 151, కాంగ్రెస్‌కు 74 స్థానాలిచ్చింది. ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్‌లోనూ బీజేపీకి 140 నుంచి 159 సీట్లు రాగా కాంగ్రెస్ 70 నుంచి 89 సీట్లకు పరిమితమైంది. రిపబ్లిక్ టీవీ కూడా బీజేపీకి 118 నుంచి 130 సీట్లిచ్చింది. కాంగ్రెస్‌కు 97 నుంచి 107 రావచ్చని పేర్కొంది. టైమ్స్ నౌ–ఈటీజీ మాత్రం కాంగ్రెస్‌కు 109–125 సీట్లివ్వగా బీజేపీకి 105–117 వస్తాయని పేర్కొంది. ఏబీపీ–సీవోటర్ కూడా కాంగ్రెస్‌కు 113 నుంచి 137 స్థానాలొస్తాయని, బీజేపీ 88 నుంచి 112కు పరిమితమవుతుందని చెప్పింది. జన్ కీ బాత్ మాత్రం రెండు పారీ్టలూ 100 నుంచి 125 సీట్ల మధ్య గెలుచుకుంటాయని జోస్యం చెప్పింది. రాజస్థాన్‌లో కమల వికాసమే రాజస్థాన్‌లో బీజేపీ విజయం ఖాయమని చాలా ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మూడు మాత్రం కాంగ్రెస్ బహుశా రాజస్థాన్‌లో నెగ్గే అవకాశముందని అంచనా వేశాయి. రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ సీట్లు కాగా మెజారిటీకి 101 స్థానాలు రావాలి. టైమ్స్ నౌ సర్వేలో బీజేపీకి 108 నుంచి 128, కాంగ్రెస్‌కు 56 నుంచి 72 సీట్లొచ్చాయి. ఇక బీజేపీ 105 నుంచి 125 స్థానాలు సాధిస్తుందని రిపబ్లిక్ టీవీ పేర్కొంది. కాంగ్రెస్ 69 నుంచి 81కి పరిమితమవుతుందని చెప్పింది. ఏబీపీ–సీవోటర్ బీజేపీకి 94–114, కాంగ్రెస్‌కు 71–91 సీట్లిచ్చింది. జన్ కీ బాత్ సర్వే కూడా బీజేపీ 100 నుంచి 122 సీట్లు గెలుస్తుందని, కాంగ్రెస్ 62 నుంచి 85కు పరిమితమవుతుందని పేర్కొంది. టుడేస్ చాణక్య బీజేపీకి 101, కాంగ్రెస్ 89 సీట్లిచి్చంది. ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా బీజేపీకి 86 నుంచి 106, కాంగ్రెస్‌కు80 నుంచి 100 సీట్లొస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ 94 నుంచి 104 సీట్లతో అధికారం నిలుపుకుంటుందని, బీజేపీకి 80 నుంచి 90 స్థానాలొస్తాయని ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ పేర్కొంది. తెలంగాణలో కాంగ్రెస్ పాగా తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు తెర దించి తొలిసారిగా కాంగ్రెస్ అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 119 స్థానాల అసెంబ్లీలో మెజారిటీకి 60 స్థానాలు కావాల్సి ఉండగా కాంగ్రెస్‌కు 60 నుంచి 70 దాకా వస్తాయని టైమ్స్ నౌ–ఈటీజీ అంచనా వేసింది. బీఆర్ఎస్ 37 నుంచి 45 సీట్లకు పరిమితమవుతుందని చెప్పింది. బీజేపీకి 6 నుంచి 8, మజ్లిస్‌కు5 నుంచి 7 రావచ్చని పేర్కొంది. రిపబ్లిక్ టీవీ కూడా కాంగ్రెస్‌కు 58 నుంకచి 68 సీట్లిచి్చంది. బీఆర్ఎస్కు 46 56, బీజేపీకి 4 నుంచి 9 వస్తాయని, ఇతరులు 5 నుంచి 9 సీట్లు నెగ్గుతారని పేర్కొంది. ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ అయితే కాంగ్రెస్‌కు ఏకంగా 63 నుంచి 79 సీట్లిచి్చంది. బీఆర్ఎస్ 31 నుంచి 47తో సరిపెట్టుకుంటుందని చెప్పింది. బీజేపీకి 2 నుంచి 4, మజ్లిస్‌కు5 నుంచి 7 వస్తాయని తెలిపింది. టుడేస్ చాణక్య కూడా కాంగ్రెస్‌కు 71 సీట్లు, బీఆర్ఎస్కు 33, బీజేపీకి 7, ఇతరులకు 8 స్థానాలిచి్చంది. కాంగ్రెస్ 49 నుంచి 65 సీట్లొస్తాయని ఏబీపీ–సీవోటర్ సర్వే పేర్కొంది. బీఆర్ఎస్కు 38 నుంచి 54, బీజేపీకి 5 నుంచి 13 వస్తాయని, ఇతరులు 5 నుంచి 9 సీట్లు నెగ్గుతారని చెప్పుకొచ్చింది. జన్ కీ బాత్ కూడా కాంగ్రెస్‌కు 48 నుంచి 64, బీఆర్ఎస్కు 40 నుంచి 55 సీట్లిచి్చంది. బీజేపీ 7 నుంచి 13, మజ్లిస్ 4 నుంచి 7 సీట్లు నెగ్గుతాయని చెప్పింది. మిజోరంలో హంగ్ ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) ఈసారి ఎదురీదుతోందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఎంఎన్ఎఫ్కు ఈసారి జోరాం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) గట్టి పోటీ ఇచి్చనట్టు పేర్కొన్నాయి. బహుశా హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని జోస్యం చెప్పాయి. కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమవుతుందని, బీజేపీకి ఒకట్రెండు స్థానాలు దాటకపోవచ్చని తెలిపాయి. మొత్తం 40 స్థానాలకు గాను రిపబ్లిక్ టీవీ మాత్రం ఎంఎన్ఎఫ్కు 17 నుంచి 22 దాకా ఇచ్చింది. ఏబీపీ సీవోటర్ కూడా దానికి 15 నుంచి 21 స్థానాలు రావచ్చని పేర్కొంది. మిగతా సర్వేలన్నీ అది మెజారిటీకి కొద్ది దూరంలోనే నిలిచిపోతుందని తేల్చాయి. జెడ్పీఎం ఏకంగా 28 నుంచి 35 సీట్లతో ఘనవిజయం సాధిస్తుందని ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా పేర్కొనడం విశేషం! ఎంఎన్ఎఫ్ కేవలం 3 నుంచి 7 సీట్లకు, కాంగ్రెస్ 2 నుంచి 4 స్థానాలకు పరిమితమవుతాయని అది తేల్చింది. మిగతా సర్వేలన్నీ ఎంఎన్ఎఫ్కు 14 నుంచి 18 సీట్లు, జెడ్పీఎంకు 10 నుంచి 16 సీట్ల చొప్పున ఇచ్చాయి. ఛత్తీస్‌గఢ్ ‘హస్త’గతం! ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్ బఘెల్ సర్కారు పనితీరుకు ప్రజలు మరోసారి పట్టం కడుతున్నట్టు పలు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 40 50 దాకా వస్తాయని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. బీజేపీ 36 నుంచి 46 దాకా గెలుచుకుంటుందని అంచనా వేసింది. టైమ్స్ నౌ–ఈటీజీ కాంగ్రెస్‌కు 48 నుంచి 56, బీజేపీకి 32 నుంచి 40 సీట్లిచ్చింది. కాంగ్రెస్‌కు 57, బీజేపీకి 33 సీట్లొస్తాయని టుడేస్ చాణక్య పేర్కొంది. ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ సర్వే కాంగ్రెస్‌కు 46–56, బీజేపీకి 30–40 సీట్లిచి్చంది. రిపబ్లిక్ టీవీ కూడా కాంగ్రెస్44 నుంచి 52 సీట్లు గెలుస్తుందని, బీజేపీ 35 నుంచి 42 సీట్లకు పరిమితమవుతుందని అభిప్రాయపడింది. ఇక రెండు పారీ్టలూ హోరాహోరీగా తలపడ్డట్టు ఏబీపీ–సీవోటర్, జన్ కీ బాత్ తేల్చాయి. కాంగ్రెస్‌కు 41 నుంచి 53, బీజేపీకి 36 నుంచి 48 సీట్లు రావచ్చని ఏబీపీ చెప్పింది. ఇక జన్ కీ బాత్ సర్వే బీజేపీకి 34 నుంచి 45, కాంగ్రెస్‌కు 42 నుంచి 53 స్థానాలిచ్చింది. -
రేపే పోలింగ్ : భారీ నగదు, నగలు పట్టివేత
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున నగలు నగదు పట్టుబడింది. అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని గంటల్లో పప్రారంభం కానున్న నేపథ్యంలో మొత్తం 428 కోట్ల రూపాయల విలువైన నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న వాటిలో 225.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా, బంగారంతో సహా విలువైన లోహాలు 176.11 కోట్లు ఉన్నట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మద్యం కూడా పట్టుబడింది. గత 24 గంటలలో కరూర్, కోయంబత్తూర్, తిరుప్పూర్ , చెన్నైలు భారీ దాడులు నిర్వహించినట్టు ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గత కొన్ని వారాలుగా ఈ దాడులు జరిగాయన్నారు. ఇందులో కరూర్ అగ్రస్థానంలో ఉండగా, కోయంబత్తూర్, తిరుప్పూర్, చెన్నై తరువాతి స్థానాల్లో నిలిచాయి. తాజాగా రాణిపేట జిల్లాలో రూ. 91.56 లక్షలు, చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో 1.23 కోట్ల రూపాయలు, సేలం వీరపాండి వద్ద 1.15 కోట్ల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా గత నెలలో, ఆదాయపు పన్ను శాఖ 16 కోట్లకు పైగా అక్రమ నగదును స్వాధీనం చేసుకుంది.అలాగే ఎన్నికల నిఘాలో భాగంగా రాష్ట్రంలో పలు సంస్థలపై దాడుల తరువాత సుమారు రూ. 80 కోట్ల బ్లాక్ మనీని గుర్తించింది. కాగా 234 నియోజకవర్గాల్లో మంగళవారం పోలింగ్ షురూ కానుంది. తమిళనాట సింగిల్-ఫేజ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే ప్రచార పర్వం ముగిసి నసంగతి తెలిసిందే. -
బీజేపీకి తొలిస్థానం
నిధుల వ్యయం, సేకరణలో కమలం పార్టీ ఫస్ట్ ఐదు రాష్ట్రాల ఎన్నికల వ్యయం రూ.573 కోట్లు! పార్టీలు సేకరించింది రూ.355 కోట్లే ఏడీఆర్ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు రూ.573 కోట్లు ఖర్చు చేశాయి. అయితే అవి సేకరించిన మొత్తం రూ. 355 కోట్లేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్(ఏడీఆర్) నివేదిక స్పష్టం చేసింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో అన్ని ప్రాంతీయ, జాతీయ పార్టీల నిధుల వ్యయం, సేకరణకు సంబంధించిన గణాంకాలను పొందుపరచి ఈ నివేదికను విడుదల చేశారు. ముఖ్యాంశాలు: జాతీయ పార్టీలు సేకరించిన నిధులు రూ.287.89 కోట్లు కాగా, వ్యయం చేసినది రూ.188.12 కోట్లు. ప్రాంతీయ పార్టీలు 67.22 కోట్లు వసూలు చేసి 213.97 కోట్లు ఖర్చు చేశాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ కలసి రూ.573.24 కోట్లు ఖర్చు చేశాయి. వీటిలో ప్రచార, ప్రయాణ, ఇతర ఖర్చులు, అభ్యుర్థులకు ఇచ్చే మొత్తం తదితరాలున్నాయి. జాతీయ పార్టీల్లో బీజేపీ అత్యధికంగా సేకరించిన రూ.131.72 కోట్లు... జాతీయ, ప్రాంతీయ స్థాయిలో ఆరు జాతీయ పార్టీలు సేకరించిన దానిలో 45.75 శాతానికి సమానం. జాతీయ స్థాయిలో అయిన 112.14 కోట్ల వ్యయంలో బీజేపీ అత్యధికంగా రూ.84.36 కోట్లను ఖర్చు చేసింది. రాష్ట్రస్థాయిలో కేరళ బీజేపీ యూనిట్ అత్యధికంగా 14.11 కోట్లు, తరువాత పశ్చిమ బెంగాల్ యూనిట్ రూ.5.70 కోట్లు, అస్సాం యూనిట్ రూ. 4.03 కోట్లు ఖర్చు చేశాయి. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ రూ.41.49 కోట్లు ఖర్చు చేసింది. అందులో రూ.14.57 కోట్లు(లేదా 35.12 శాతం) జాతీయ స్థాయిలోనే వ్యయమయ్యాయి. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే...ఎస్పీ అత్యధికంగా రూ.35.66 కోట్లు సేకరించింది. డీఎంకే అత్యధికంగా రూ.97.34 కోట్లు ఖర్చు చేసింది. బీజేపీ సేకరించిన మొత్తం నిధుల్లో 65.53 శాతం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే వచ్చాయి. రూ.94.23 కోట్లు సేకరించి కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్ర స్థాయిలో గానీ, కేంద్ర స్థాయిలో గానీ ఎలాంటి నిధులు సేకరించలేదని బీఎస్పీ ప్రకటించింది. జాతీయ పార్టీలు తమ అభ్యర్థులకు రూ.151.65 కోట్లు ఇవ్వగా, ప్రాంతీయ పార్టీలు అభ్యర్థులపై రూ.60.89 కోట్లు ఖర్చు చేశాయి. మీడియాలో ప్రకటనలకు జాతీయ పార్టీలు రూ.82.08 కోట్లు, ప్రాంతీయ పార్టీలు రూ.95.49 కోట్లు ఖర్చు చేశాయి.


