యనమలకుదురులో కుప్పకూలిన ప్రభ | - | Sakshi
Sakshi News home page

యనమలకుదురులో కుప్పకూలిన ప్రభ

Feb 17 2026 8:58 AM | Updated on Feb 17 2026 8:58 AM

యనమలకుదురులో కుప్పకూలిన ప్రభ

యనమలకుదురులో కుప్పకూలిన ప్రభ

పెనమలూరు: కృష్ణా జిల్లా యనమలకుదురులో ఆదివారం జరిగిన మహా శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఓ ప్రభ అదుపుతప్పి భక్తులపై పడిపోయింది. ఈ ఘటనలో భక్తురాలికి గాయాలయ్యాయి. యనమలకుదురు అంబేడ్కర్‌నగర్‌కు చెందిన నంబర్‌–29 ప్రభ ప్రదర్శనలో ఉండగా దానికి ఏర్పాటు చేసిన రథం చక్రాలు విరిగి పోయాయి. దీంతో ఒక్కసారిగా ప్రభ పక్కకు ఒరిగి కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో బాపులపాడుకు చెందిన రేవతి తలకు బలమైన గాయమైంది. వెంటనే ఆమెను పోరంకిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement