మహిళలకు కారు డ్రైవింగ్‌లో శిక్షణ
మహిళలకు కారు డ్రైవింగ్‌లో శిక్షణ గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): గుంటుపల్లిలోని రూరల్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్, ఆంత్రప్రెన్యూ ర్‌షిప్ సెంటర్ (రైజ్) ఆధ్వర్యంలో రవాణా శాఖ సహకారంతో ఔత్సాహిక మహిళలకు కారు డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ లక్ష్మీశ గురువారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రవాణా శాఖ నుంచి లెర్నింగ్ లైసెన్సు పొందిన మహిళలకు భవిష్యత్తులో సుస్థిర జీవనోపాధికి వీలుగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. లైసెన్సు పొందిన అనంతరం ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేస్తూ వాహనాలు సమకూర్చుకునేందుకు చేయూత ఇవ్వనున్నట్లు తెలిపారు. రైజ్ సెంటర్ గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు మార్గదర్శిగా నిలుస్తోందన్నారు. స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయాలనుకునే మహిళలకు సరైన మార్గనిర్దేశంతో పాటు శిక్షణ, మార్కెటింగ్ సహకారం అందిస్తోందన్నారు. డీఆర్‌డీఏ పీడీ నాంచారరావు, ఆర్‌టీవో ప్రవీణ్, బ్లాక్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, మేనేజర్ తేజస్విని తదితరులు పాల్గొన్నారు.
5నుంచి 9వ తేదీ వరకు ఆర్జిత సేవలు రద్దు విచారణ ప్రారంభం పోలీస్ స్టేషన్‌కు
చేరిన ఇంటర్ ప్రశ్న పత్రాలు కృష్ణలంక(విజయవాడతూర్పు): ఇంటర్మీడియెట్ పరీక్షలు ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ప్రశ్న పత్రాలు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. గురువారం ఉదయం స్టేషన్ పరిధిలోని ఐదు పరీక్ష కేంద్రాలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు వచ్చాయి. కస్టోడియన్ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక వాహనంలో సీల్ వేసిన ప్రశ్న పత్రాలు బండిల్స్, ఇనుప పెట్టెలు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ హౌస్ అధికారి నాగరాజు, కస్టోడియన్ అధికారి బాలరాజు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్స్ సమక్షంలో ప్రశ్న పత్రాలను పెట్టెలలో పెట్టి సీల్ వేసి స్టేషన్‌లోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. స్టేషన్ పరిధిలో శ్రీపొట్టి శ్రీరాములు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక కేంద్రం, శ్రీదుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఒక కేంద్రం, శ్రీభవిష్య జూనియర్ కాలేజీలో మూడు పరీక్ష కేంద్రాలకు సంబంధించిన పశ్న పత్రాలను భద్రపరిచారు. పరీక్ష రోజున ఆ రోజు జరిగే పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాన్ని స్టేషన్ నుంచి పరీక్ష కేంద్రాలకు తరలిస్తారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో మార్చి 5 నుంచి 9వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. 3వ తేదీ చంద్రగ్రహణం నేపథ్యంలో శాంతి కల్యాణం, చండీహోమం, సాయంత్రం పంచహారతుల సేవ, పల్లకీ సేవలను రద్దు చేశారు. ఇక 4వ తేదీ ఉదయం అమ్మవారికి స్నపనాభిషేకం నేపథ్యంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ, వస్త్రాలంకరణ సేవ, ఖడ్గమాలార్చన, నవగ్రహహోమం, గణపతి హోమాలను రద్దు చేశారు. ఉదయం 7.30గంటలకు ప్రారంభమయ్యే లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమాలను ఉదయం 8.30 గంటలకు నిర్వహిస్తారు. ఇక 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆలయంలో జరిగే కుంభాభిషేక మహోత్సవం నేపథ్యంలో అన్ని సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
మచిలీపట్నంటౌన్: రైల్వేలో ఉద్యోగాల పేరుతో బురిడీ కొట్టించారని ఈ నెల 19న ‘సాక్షి’లో ప్రచురితమైన వార్త కు రైల్వే పోలీసులు స్పందించారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ (సికింద్రాబాద్) ఆదేశాలతో గురువారం విజయవాడ రైల్వే ఇంటెలిజెన్స్ ఎస్‌ఐ పోలయ్య తన బృందంతో మచిలీపట్నం విచ్చేశారు. తొలుత రైల్వే క్వార్టర్‌కు వెళ్లి పరిశీలించగా రైల్వే ఉద్యోగి కిషోర్ కుమార్ క్వార్టర్‌కు తాళం వేసి ఉండడంతో రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం బాధితుల నుంచి కలిసి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెండు గంటల పాటు విచారించారు. వారి వద్ద ఉన్న ఆధారాలను సేకరించి, ఈ వ్యవహారానికి సంబంధించిన కాల్ రికార్డులను విన్నారు.
1/2
మహిళలకు కారు డ్రైవింగ్‌లో శిక్షణ
2/2
మహిళలకు కారు డ్రైవింగ్‌లో శిక్షణ