చెస్ మహిళా జట్టు ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్(మహిళల) టోర్నమెంట్‌లో తమ యూనివర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు క్రీడాకారులను ఎంపిక చేశామని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి డాక్టర్ ఈ.త్రిమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నంలోని గీతమ్ డీమ్డ్ యూనివర్సిటీ ఆవరణలో జరగనున్న ఈ టోర్నీకి ఎం.సాయిదివ్వ, ఎన్.సాత్విక, బి.నివేదితా బాయ్, ఏ.శ్రీనిధి, ఆర్.దీపిక, డి.అమూల్య ఎంపిక య్యారని తెలిపారు. విశాఖపట్నలోని ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన ఆర్.గున్నాజీని జట్టు మేనేజర్‌గా, కోచ్‌గా డాక్టర్ కె.రామకృష్ణారావును ఎంపిక చేశామని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులను వర్సిటీ వైస్ చాన్స్‌లర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయి సుఽధీర్ అభినందించారు.


