సమస్యలు తక్షణమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

Feb 20 2026 6:59 AM | Updated on Feb 20 2026 6:59 AM

సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

మచిలీపట్నంఅర్బన్‌: సహకార సంఘాల ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు వైవీవీ మోహన్‌ రావు డిమాండ్‌ చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి కొనసాగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా గురువారం కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ వద్ద ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 28 తేదీ వరకు ఉదయం 9నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా చౌక్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జన్యావుల రామాంజనేయులు, అడపా శ్రీనివాసరావు, వీర వల్లి వెంకటేశ్వరరావు, రాజులపాటి శ్రీనివాసరావు, అనుమకొండ శ్రీనివాసరావు, మెట్ల శ్రీనివాసరావు, మన్నే శ్రీనివాసరావు, వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement