జాతీయ సాంఘిక నాటకోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

జాతీయ సాంఘిక నాటకోత్సవాలు ప్రారంభం

Feb 20 2026 6:59 AM | Updated on Feb 20 2026 6:59 AM

జాతీయ సాంఘిక నాటకోత్సవాలు ప్రారంభం

జాతీయ సాంఘిక నాటకోత్సవాలు ప్రారంభం

విజయవాడ కల్చరల్‌: ఏపీ సృజనాత్మక సాంస్కృతిక సమితి సౌజన్యంతో శ్రీ కృష్ణ తెలుగు థియేటర్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యాన ఈ నెల 19 నుంచి మూడు రోజులపాటు నిర్వహించే 26వ సాంఘిక నాటకోత్సవాలు గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో గురువారం ప్రారంభమయ్యాయి. సమాజంలో విలువలతో కూడిన రాజకీయాలు నడపాలని, సమాజమే దేవాలయమని పీడిత తాడిత ప్రజలకు మేలు చేస్తే ప్రజల గుండెల్లో నిలచిపోతారనే సందేశంతో హేలాపురి కల్చరల్‌ అసోసియేషన్‌ ఏలూరు వారి అనగనగా ఓ రాత్రి సాగుతుంది. రచన పీవీ సత్యనారాయణ, దర్శకత్వం మహ్మద్‌ఖాజావలి, రెండో నాటికగా హైదరాబాద్‌కు చెందిన స్వర్ణసూర్యా డ్రామాలవర్స్‌ వారి సీ్త్రమాత్రేనమః మూడో నాటికగా ఉషోదయ, కట్రపాడు వారి మంచి మనసులు నాటకాన్ని ప్రదర్శించారు. నాటక పోటీలను ప్రారంభించిన సమాచార పౌరసంబంధాల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కిరణ్‌కుమార్‌ పోతలు మాట్లాడుతూ తెలుగు నాటకాలకు పూర్వవైభవం తీసుకురావాలన్నారు. శ్రీకృష్ణ తెలుగు థియేటర్‌ ఆర్ట్స్‌ గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ కేవీ రంగనాథన్‌, కోశాధికారి చంద్రశేఖర్‌, శ్రీ కృష్ణ తెలుగు ఽథియేటర్‌ ఆర్ట్స్‌ క్రియాశీలక నిర్వాహకులు హరి రవిశంకర్‌, మక్కపాటి అవంతి, బొర్రా నరేన్‌, హెచ్‌వీఆర్‌ఎస్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement