ప్రజలకు బాబు వెన్నుపోటు..
గత సార్వత్రిక ఎన్నికలలో ప్రజల ఓట్లు రాబట్టడానికి కూటమి నాయకులు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇప్పటి వరకు చిత్తశుద్ధితో అమలు చేసిన దాఖలాలు లేవు. వరుసగా రెండో ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అయినా నిధుల కేటాయింపు ఉంటుందని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. తీరా బడ్జెట్ చూశాక ప్రజలకు మరోసారి నిరాశ తప్పలేదు. గత ప్రభుత్వంలో ప్రతి హామీని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే నిధులు కేటాయిస్తూ పకడ్బందీగా అమలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వ పరిపాలనలో హామీలను పూర్తిగా విస్మరించడం బాధాకరం. ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రజలకు మరోసారి బాబు వెన్నుపోటు పొడిచారు. – సంగా మధుసూదనరావు, ఎంపీపీ, గూడూరు


