నిరాశపరిచిన బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ విద్యా రంగాన్ని పూర్తిగా నిరాశపరి చింది. బడ్జెట్ కేటాయింపుల్లో కేవలం 10.5 శాతమే విద్యారంగానికి ఇవ్వడం విచారకరం. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో 30 శాతం విద్యారంగానికి కేటాయించాలని కొఠారి కమిషన్ సిఫారసు చేసింది. దానిని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. గత ఏడాది బడ్జెట్‌తో పోల్చినా ఈ కేటాయింపులు చాలా తక్కువ. ఈ నిధులు విద్యారంగ సమగ్ర అభివృద్ధికి ఏ విధంగానూ ఉపయోగపడవు.
– ఎస్.సమరం,
ఎస్‌ఎఫ్‌ఐ కృష్ణా జిల్లా కార్యదర్శి


