బందరు కాలువలో మృతదేహం లభ్యం
పెనమలూరు: రెండు రోజుల క్రితం పెనమలూరు వంతెన పైనుంచి బందరు కాలువలో దూకి గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది శనివారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తల గొడవలు కారణంగా భర్త షేక్ నాగుల్‌మీరా(36) పై భార్య అనూష పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడ్డారు. ఆ భయంతో భర్త గురువారం బందరు కాలువలో దూకి గల్లంతయ్యాడు. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది కాలువలో గల్లంతైన నాగుల్‌మీరా కోసం రెండు రోజులుగా గాలిస్తున్నారు. శనివారం గంగూరు డీమార్ట్ వెనుక ఉన్న బందరు కాలువ గుర్రపుడెక్కలో మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుణదల(విజయవాడ తూర్పు): పట్టపగలు ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు అక్కడున్న బాలుడు గొంతుపై కత్తి పెట్టి బెదిరించి చోరీకి విఫలయత్నం చేసిన ఘటన మాచవరం పీఎస్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. జనసంచార ప్రాంతంలో ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంమాచవరం యారం వారి వీధికి చెందిన బత్తుల రాజేష్ ప్రైవేటు ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం ఉదయం అతను పనికి వెళ్లారు. భార్య సౌజన్య పెద్ద కుమారుడితో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. ఇంట్లో చిన్న కుమారుడు బత్తుల హర్ష ఒక్కడే ఉన్నాడు. మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు ఆ ఇంట్లో చొరబడ్డారు. హర్ష గొంతుపై కత్తి పెట్టి బెదిరించి చోరీకి యత్నించారు. ఇంతలో హర్ష కేకలు వేయడంతో వారు పరారయ్యారు. ఇంట్లో విలువైన వస్తువులు, డబ్బుగానీ చోరీ కాలేదు. ఈ విషయం గురించి హర్ష తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. వారు పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలంలో సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించగా ఆరుగురు మాస్కులు ధరించి చోరీకి యత్నించినట్లు గుర్తించారు. హర్ష గొంతుపై కత్తి పెట్టిన వ్యక్తికి చేతిపై టాటూలు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు భద్రత కల్పించాల్సిందిగా బాధితులు పోలీసులకు విన్నవించారు.
ఏడుగురికి తీవ్ర గాయాలు
కృత్తివెన్ను: మాట్లం తూము సమీపంలో 126 జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం వ్యాన్ ఢీకొనడంతో మహిళ మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కృత్తివెన్ను ఎస్‌ఐ పైడిబాబు తెలిపిన వివరాల ప్రకారం చినగొల్లపాలెం నుంచి కత్తివెన్నుకు మోటార్ సైకిల్‌పై వస్తున్న వారిని.. చేపల వేటకోసం పోడు గ్రామం వెళుతున్న వ్యాన్ ఎదురుగా ఢీకొట్టింది. ఘటనలో మోటార్ సైకిల్ మీద ఉన్న జ్యోతి (40)ఘటనా స్థలంలోనే మరణించగా మంగమ్మ, ఏసురాజులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 13 మంది ఉండగా వారిలో ఏడుగురికి తీవ్రంగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలైనట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బందరు కాలువలో మృతదేహం లభ్యం
బందరు కాలువలో మృతదేహం లభ్యం


