ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం
అసోసియేషన్ ఆఫ్ ఓరల్ మాక్సిల్లో ఫేషియల్‌సర్జన్స్ ఇండియా ఏర్పాటై 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ ఏడాది తాము చేసే శస్త్రచికిత్సలపై విస్తృతంగా అవగాహన కలిగించాలని నిర్ణయించారు. అందులో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో ముఖ గాయాలు, ఓరల్ క్యాన్సర్, ముఖ దవడ కణితులకు శస్త్ర చికిత్సలు , వాటి నివారణ మార్గాలపై విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల డెంటల్ వింగ్స్, దంత వైద్య కళాశాలల ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనేది ఈ ఏడాది నినాదంగా తెలిపారు.
– నాదెళ్ల కోటేశ్వరరావు, పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు, ఏఓఎంఎస్‌ఐ


