భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

Feb 13 2026 5:35 AM | Updated on Feb 13 2026 5:35 AM

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య రౌడీషీటర్‌పై చర్యలు

పెనమలూరు: భార్యను వద్దన్నా పుట్టింటికి వెళ్లిందని భర్త మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుక్ను ఘటన కానూరులో జరిగింది. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నంకు చెందిన బండి ఉదయకుమారి, నాగమల్లేశ్వరరావుకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు బండి క్రాంతికుమార్‌(30)కు ఏడు నెలల క్రితం పెదముత్తేవి గ్రామానికి చెందిన అమలరాణితో వివాహమైంది. క్రాంతికుమార్‌ ఎనికేపాడులో ఒక కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. దంపతులిద్దరూ 20 రోజుల క్రితం కానూరు కమ్మర్ల బజార్‌లో కాపురం పెట్టారు. భార్య నెల తప్పటంతో ఈ నెల 11వ తేదీన ఆమె తన పుట్టింటికి వెళ్తానని భర్తకు తెలిపింది. దీనికి భర్త వద్దన్నాడు. అయితే భర్త లేని సమయంలో భార్య అమలరాణి పుట్టింటికి వెళ్లింది. రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన భర్త క్రాంతికుమార్‌ భార్య ఇంట్లో లేకపోవటంతో వీడియో కాల్‌ చేసి తనకు చెప్పకుండా ఎందుకు వెళ్లావని భార్యతో గొడవపడ్డాడు. నేను చనిపోతానని భార్యను బెదిరించాడు. ఈ విషయం అమలరాణి అత్త ఉదయకుమారికి చెప్పింది. ఉదయకుమారి ఫోన్‌చేయగా క్రాంతికుమార్‌ ఫోన్‌ తీయలేదు. దీంతో ఉదయకుమారి గురువారం ఉదయం క్రాంతికుమార్‌ ఉంటున్న ఇంటికి వచ్చి చూడగా అప్పటికే క్రాంతికుమార్‌ బెడ్‌రూమ్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు లుంగీతో ఉరేసుకుని మృతి చెంది ఉన్నాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

పెనమలూరు: పెనమలూరు పోలీసులకు తలనొప్పిగా మారిన రౌడీషీటర్‌ కొండూరు మణికంఠ(కేటీఎం పండు)పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అతనిని జిల్లా కలెక్టర్‌, మెజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌కు పంపారు. పెనమలూరు సీఐ వెంకటరమణ గురువారం వివరాలు తెలుపుతూ పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్‌గా ఉన్న కేటీఎం పండు గతంలో అనేక నేరాలకు పాల్పడ్డారన్నారు. అతను హింసాత్మక నేరాలతో పాటు, గంజాయి రవాణా, హత్య, హత్యాయత్నం కేసుల్లో ఉన్నాడని తెలిపారు. అతనిని జైలుకు పంపిన తరువాత బెయిల్‌పై వచ్చి మరల నేరాలకు పాల్పడుతున్నాడని, అతని ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. దీంతో జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు ఎస్పీకి నివేదిక అందచేశారు. దీంతో మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద కేటీఎం పండును అదుపులోకి తీసుకోని రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పంపామని సీఐ వెంకటరమణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement