తిరుపతమ్మ ఆలయానికి రూ.2.71 కోట్ల ఆదాయం
పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మవారి ఆలయం వద్ద వివిధ వ్యాపా రాలు నిర్వహించే హక్కు పొందేందుకు శుక్ర వారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ –ప్రొక్యూర్మెంట్ టెండర్ కం బహిరంగ వేలం ద్వారా రూ.2,71,06,062 ఆదాయం సమకూ రిందని ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి తెలిపారు. భక్తులు సమర్పించే తల నీలాలు పోగు చేసుకునే హక్కును రూ.2,07,72,729లకు శ్రీనివాస హెయిర్ ఇండస్ట్రీస్ (ఏలూరు), కొబ్బరి చెక్కలు పోగుచేసుకునే హక్కు రూ.52,33,333 లకు రెడ్డి మణికంఠ (తూర్పు గోదావరి జిల్లా), తిరునాళ్లలో జెయింట్ వీల్, కొలంబస్, పాస్ట్‌ఫుడ్ నిర్వహణకు రూ.11 లక్షలకు ఆర్.ఫణికుమార్ (ఉయ్యూరు) హెచ్చు పాటదారులుగా నిలిచి లైసెన్స్ హక్కులు పొందారని పేర్కొన్నారు. ఈఈ రమ, ఏఈఓ జంగం శ్రీనివాస రావు, చుంచు రమేష్‌బాబు పాల్గొన్నారు.
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి బొమ్మల పోటీలు ఈ నెల 22 నుంచి మార్చి ఎనిమిదో తేదీ వరకు జరుగుతాయని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తెలిపారు. స్థానిక ఎక్స్‌పీరియన్స్ కేంద్రంలో ఈ పోటీల బ్రోచర్‌ను జేసీ ఇలక్కియ, కొండపల్లి మునిసిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ జి.కృష్ణన్ శుక్రవారం ఆవిష్కరించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. సంప్రదాయ కళను ప్రోత్సహించి, కళాకారుల జీవనోపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పోటీలకు శుక్రవారం ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు శనివారం రాత్రి పది గంటల వరకు కొనసాగుతాయన్నారు. కళాకారులు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తయిన బొమ్మలను మార్చి తొమ్మిదో తేదీన సమర్పించాలని, రూ.లక్ష విలువైన బహుమతులు, సర్టిఫికెట్లు అందజేస్తారని పేర్కొన్నారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): క్వారీ, క్రషర్ లారీలను అరుణనగర్ రోడ్డు మీదుగా నడపొ ద్దని ఆ ప్రాంతం వాసులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఆరో రోజు కొనసాగాయి. లారీ లతో దుమ్ము ధూళితో కాలుష్యం పెరిగిందని శుక్రవారం స్థానికులు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. సీపీఎం నాయకులు సంఘీభావం తెలిపారు. సీపీఎం పట్టణ కార్యదర్శి ఎం.మహేష్ మాట్లాడుతూ లారీల అతివేగంతో వెదజల్లుతున్న కాలుష్యంతో ఇళ్లల్లో ఉండలేక పోతున్నామన్నారు. గుంతలు పడిన రోడ్డులో లారీల మధ్య బైకులు నడపాలన్నా, కాలినడకతో వెళ్లాలన్నా నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో ఉన్న సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల ఆవరణలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు మూడో ఎన్‌టీపీసీ ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఫర్ ఉమెన్ ఆర్చరీ టోర్నమెంట్ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్చరీ అసో సియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్, కృష్ణాజిల్లా ఆర్చరీ అసోసియే షన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్), డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ సంయుక్తంగా ఈ పోటీ లను నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. 22వ తేదీ ఉదయం పది గంటలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు, శాప్ వైస్ చైర్మన్ ఎస్.భరణి టోర్నమెంట్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. దేశంలోని సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో రికర్వ్ అండ్ కాంపౌండ్ అంశాల్లో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రముఖ స్థానాల్లో ఉన్న మహిళా ఆర్చర్‌లు పాల్గొంటారని సత్యనారాయణ వివరించారు.
తిరుపతమ్మ ఆలయానికి రూ.2.71 కోట్ల ఆదాయం
తిరుపతమ్మ ఆలయానికి రూ.2.71 కోట్ల ఆదాయం


