మామిడి తోటల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

మామిడి తోటల పరిశీలన

Feb 13 2026 5:33 AM | Updated on Feb 13 2026 5:33 AM

మామిడి తోటల పరిశీలన

మామిడి తోటల పరిశీలన

రెడ్డిగూడెం: రెడ్డిగూడెం మండలంలోని రెడ్డికుంట గ్రామంలో చేబ్రోలు శ్రీనివాసరావు మామిడి తోటలను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించారు. రైతులందరూ తప్పని సరిగా ఫ్రూట్‌ కవర్స్‌ వాడాలని, వాటిని ఉద్యాన శాఖ రాయితీ ద్వారా ఇస్తున్నారని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే తామరపురుగు నివారణకు రైతులందరూ తప్పని సరిగా నీలి, పసుపు రంగు జిగురు అట్టలు 40–50 చొప్పున ఎకరానికి ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొంత మంది రైతులకు రోటోవేటర్‌ను కలెక్టర్‌ చేతుల మీదుగా రాయితీపై అందించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి పి. బాలాజీ కుమార్‌, ఆర్డీఓ మాధవి, తహసీల్దార్‌ జె. సుశీలాదేవి, ఎంపీడీఓ రమణ, ఉద్యాన అధికారి, వ్యవసాయ అధికారి, ఎఫ్‌పీసీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement