రాష్ట్ర స్థాయి క్రీడల్లో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్‌ విద్యార్థుల సత్తా | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి క్రీడల్లో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్‌ విద్యార్థుల సత్తా

Feb 16 2026 8:00 AM | Updated on Feb 16 2026 8:00 AM

రాష్ట

రాష్ట్ర స్థాయి క్రీడల్లో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్‌ విద

రాష్ట్ర స్థాయి క్రీడల్లో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్‌ విద్యార్థుల సత్తా బిల్‌గేట్స్‌ రాకతో ఏర్పాట్లు అదుపు తప్పి పల్టీ కొట్టిన కంటైనర్‌ రామలింగేశ్వరునికి నృత్యాభిషేకం

గుడ్లవల్లేరు: రాష్ట్ర స్థాయి క్రీడల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని ఏఏఎన్‌ఎం అండ్‌ వీవీఆర్‌ఎస్‌ఆర్‌ పాలిటెక్నిక్‌ శేషాద్రీరావు నాలెడ్జ్‌ విలేజ్‌ గుడ్లవల్లేరు కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎన్‌.రాజశేఖర్‌ ఆదివారం విలేకరులకు తెలిపారు. తెనాలిలో ప్రియదర్శిని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో ఈ నెల 12, 13 తేదీలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పాలిటెక్నిక్‌ కళాశాలల మధ్య క్రీడా పోటీలు జరిగాయన్నారు. ఈ పోటీల్లో తమ కాలేజీ విద్యార్థులు పాల్గొన్న రెండు విభాగాలు బాలికల వాలీబాల్‌, ఖోఖోలలో విజేతలుగా నిలవడమే కాకుండా అద్భుతమైన ఆటతీరుతో అందరి ప్రశంసలు పొందారన్నారు. విజేతలుగా నిలిచిన బాలికల జట్లకు నిర్వాహకులు వాలీబాల్‌ విజేతలకు రూ.10 వేలు, ఖోఖో విజేతలకు రూ.10 వేల నగదుతో పాటు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారని చెప్పారు. బహుమతులు సాధించిన విజేతలకు శిక్షణ అందించిన ఫిజికల్‌ డైరెక్టర్‌ వి.శ్రీనివాసరావు, సహాయ ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎం.భవదీప్‌ను పాలిటెక్నిక్‌ యాజమాన్య కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ వల్లూరుపల్లి నాగేశ్వరరావు, సెక్రటరీ అండ్‌ కరెస్పాండెంట్‌ వల్లూరుపల్లి సత్యనారాయణరావు(బాబ్జి), ప్రిన్సిపాల్‌ రాజశేఖర్‌, వివిధ విభాగాల శాఖాధిపతులు అభినందించారు.

ఆటోనగర్‌(విజయవాడతూర్పు): మైక్రోసాఫ్ట్‌ దిగ్గజం బిల్‌గేట్స్‌ సోమవారం విజయవాడకు రానున్న నేపథ్యంలో నగరపాలకసంస్థ అధికారులు ఆదివారం పారిశుద్ధ్య పనులను చేపట్టారు. బందరు రోడ్డుతో పాటు పటమట రైతుబజారు పరిసరాల్లోని డివైడర్‌లను శుభ్రం చేశారు. ప్రధాన రహదారుల్లోని మట్టి దిబ్బలు, చెత్తా చెదరాలను తరలించారు. పటమట రైతుబజారులోని క్రీడా ప్రాంగణాన్ని బిల్‌గేట్స్‌ సందర్శించనున్నట్లు తెలుస్తోంది. ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయం దక్షిణం వైపు గత రెండేళ్లుగా మట్టి కుప్పలు, వ్యర్థాలను డంపింగ్‌ చేశారు. అంతే కాకుండా పాత వాహనాలను ఏళ్ల తరబడి ఉంచారు. వీటన్నింటిని తొలగించడంతో ఈ ప్రాంతం అంతా పరిశుభ్రంగా మారింది.

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): పేపర్‌ లోడుతో వస్తున్న కంటైనర్‌ లారీ కొండపల్లి ఎర్రకట్ట బ్రిడ్జి వద్ద 30వ నంబర్‌ జాతీయ రహదారిపై ఆదివారం అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈప్రమాదంలో డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సేకరించిన వివరాల మేరకు భద్రాచలం పేపర్‌ కంపెనీ నుంచి పేపర్‌ బండిళ్లు లోడ్‌తో వస్తున్న లారీ విజయవాడ వైపు వెళ్తోంది. ఈక్రమంలో కొండపల్లిలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల వద్ద గతంలో ఉన్న గ్రిల్స్‌ తొలగించడంతో నూతనగా నిర్మాణం జరుగుతున్న రోడ్డులోకి లారీ దూసుకుపోయింది. తిరిగి ఎత్తులో ఉన్న పాత రోడ్డులోకి వచ్చేందుకు డ్రైవర్‌ ప్రయత్నం చేయగా అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

కూచిపూడి(మొవ్వ): నాట్య క్షేత్రం కూచిపూడిలో ఆదివారం కళాకారులు నిర్వహించిన నృత్యాభిషేకం ఆశీనులను ఆకట్టుకున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా హరిహర ఫైన్‌ ఆర్ట్స్‌(హైదరాబాద్‌) ఆధ్వర్యంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్‌ కళారత్న పసుమర్తి రామలింగ శాస్త్రి పర్యవేక్షణలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం సహకారంతో నిర్వహించిన నాట్య ప్రదర్శనలలో పాల్గొన్న కళాకారులు శివయ్యకు నాట్య నీరాజనాలను అర్పించారు. నాట్యాచార్యుల ఇలవేల్పు శ్రీగంగా బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద శ్రీ సిద్ధేంద్రయోగి కళా వేదికపై ప్రదర్శన ఇచ్చారు. నాట్య ప్రదర్శనలను గ్రామ సర్పంచ్‌ కొండవీటి వెంకట రమణ విజయలక్ష్మి పలువురు నాట్యాచార్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. పసుమర్తి రామలింగ శాస్త్రి నిర్వహణలో వెంపటి సత్యప్రసాద్‌ సహకారంతో కళాకారులను, నిర్వాహకులను దేవాలయ పాలకమండలి సభ్యులు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలతో అభినందించారు.

రాష్ట్ర స్థాయి క్రీడల్లో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్‌ విద1
1/3

రాష్ట్ర స్థాయి క్రీడల్లో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్‌ విద

రాష్ట్ర స్థాయి క్రీడల్లో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్‌ విద2
2/3

రాష్ట్ర స్థాయి క్రీడల్లో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్‌ విద

రాష్ట్ర స్థాయి క్రీడల్లో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్‌ విద3
3/3

రాష్ట్ర స్థాయి క్రీడల్లో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్‌ విద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement