రైతులకు ఒరిగింది శూన్యం | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఒరిగింది శూన్యం

Feb 16 2026 8:00 AM | Updated on Feb 16 2026 8:00 AM

రైతుల

రైతులకు ఒరిగింది శూన్యం

రైతులకు ఒరిగింది శూన్యం మోసపూరిత బడ్జెట్‌ ఆడబిడ్డ నిధి ఏమైంది నిరుద్యోగ భృతి, పెన్షన్‌ ఊసేలేదు

కంకిపాడు: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రైతులకు ఒరిగింది శూన్యం. బడ్జెట్‌లో కేటాయింపులు అరకొరగానే జరిగాయి. సాగునీటి ప్రాజెక్టులకు, వ్యవసాయానికి తగిన ప్రాధాన్యం కల్పించలేదు. ఏటా ఇస్తామని హామీ ఇచ్చిన అన్నదాత సుఖీభవ సొమ్ములో కోతలు విధించారు. రూ 20 వేలు అందిన రైతులు ఒక్కరూ లేరు. అంకెల గారడీ తప్ప రైతులకు చేసింది ఏమీ లేదు. కౌలురైతులకు అన్నదాత సుఖీభవ అందనే లేదు.

– కొండవీటి వెంకట సుబ్బారావు, వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి, మంతెన

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంకెల గారడీగా ఉంది. ఈ బడ్జెట్‌ ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడే విధంగా లేదు. బడ్జెట్‌లో సూపర్‌సిక్స్‌ పథకాలకు కనీస నిధులు కేటాయించలేదు. ఇది కేవలం ప్రజలను మోసం చేసే బడ్జెట్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయటంతో పాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేయగా.. చంద్రబాబు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అటక ఎక్కించారు.

– బీహెచ్‌ఎస్‌వీ జానారెడ్డి, కార్పొరేటర్‌

18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామంటూ ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇంటింటా తిరిగి సూపర్‌సిక్స్‌ బాండ్లు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచింది. మూడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. కానీ ఆడబిడ్డ నిధి ఊసే ఎత్తడం లేదు. ఇది మహిళలను మోసం చేయడం కాదా. ఓట్లు కోసం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారు. మహిళలను మోసం చేసిన వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు.

– అంబడిపూడి నిర్మలకుమారి, కార్పొరేటర్‌

అవనిగడ్డ: గత ఎన్నికల్లో విస్త్రత ప్రచారం చేసి నిరుద్యోగులకు ఆశలు కల్పించిన నిరుద్యోగ భృతి, 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్‌ గురించి ఈ బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. దీనివల్ల ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు అడియాసలే ఎదురయ్యాయి. ఆడబిడ్డ నిధికి రూ.32,400 కోట్లు అవసరం కాగా ఒక్క రూపాయి కేటాయించలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. – నలుకుర్తి రమేష్‌, వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

రైతులకు ఒరిగింది శూన్యం 
1
1/3

రైతులకు ఒరిగింది శూన్యం

రైతులకు ఒరిగింది శూన్యం 
2
2/3

రైతులకు ఒరిగింది శూన్యం

రైతులకు ఒరిగింది శూన్యం 
3
3/3

రైతులకు ఒరిగింది శూన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement