శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

Feb 16 2026 8:00 AM | Updated on Feb 16 2026 8:00 AM

శైవక్

శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు తోట్లవల్లూరు: మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని శైవక్షేత్రాలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాల కోసం భారీగా తరలివచ్చిన భక్తజనంతో కృష్ణానది తీరప్రాంతం కిటకిటలాడింది. దక్షిణకాశీగా పేరుగాంచిన ఐలూరు శ్రీగంగా పార్వతీ సమేత రామేశ్వరస్వామి ఆలయం లో కోలాహలం నెలకొంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు కృష్ణానదిలో ఏర్పాటు చేసిన షవర్ల కింద జల్లుస్నానాలను ఆచరించారు. పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయటంతో పాటు మహిళలు శాస్త్రోక్తంగా వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కృష్ణానదిలో పుణ్యస్నానాల అనంతరం భక్తులు రామేశ్వరస్వామిని, పక్కనే ఉన్న రఘునాయకస్వామిని దర్శించుకుని పూజలు జరిపారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయానికి వెళ్లే అన్ని దారులు, ఆలయంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి రామేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దాతలు భక్తులకు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశారు. పమిడిముక్కల సీఐ చిట్టిబాబు ఆధ్వర్యంలో ఎస్‌ఐ కిషోర్‌, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. తహసీల్దార్‌ కుసుమకుమారి, ఎంపీడీఓ రవికాంత్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ సుబ్బారావు, ఆలయ మేనేజర్‌ శివగోపాలరావు, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, వీఆర్వో శ్రీనివాసరావు పర్యవేక్షించారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌ రామేశ్వరస్వామిని, రఘునాయకస్వామిని దర్శించుకున్నారు. స్వామి వార్లకు ప్రత్యేక పూజలు జరిపి వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. జెడ్పీటీసీ జొన్నల రామ్మోహన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కళ్లం వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్‌ ఉమ్మడిశెట్టి ఉదయభాస్కర్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌ లతీఫ్‌ హుస్సేన్‌, నాయకులు మర్రెడ్డి శేషిరెడ్డి, చింతలపూడి గవాస్కర్‌రాజు, ఈడ్పుగంటి రూబెన్‌ తదితరులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తజన సందోహం.. ముక్తేశ్వరాలయం

రామేశ్వరస్వామికి విశేష పూజలు..

స్వామి సేవలో కై లే..

ముక్త్యాల(జగ్గయ్యపేట): భవానీ ముక్తేశ్వరాలయ ప్రాంగణంలో భక్తజన సందోహం నెలకొంది. తెల్లవారు జాము నుంచే ఏపీ, తెలంగాణా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ సమీపంలోని కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసి ముక్తేశ్వరునికి అభిషేకాలు, కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శివనామస్మరణతో మార్మోగింది. నదిలో పిండ ప్రధానాలతో పాటు వీర్ల కొలుపు, వీరభద్రుడు, ఎల్లమ్మ సామాగ్రి, కృష్ణమ్మ పవిత్ర జలంతో వారి ఆచారం ప్రకారం పూజలు చేశారు.

శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు 1
1/3

శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు 2
2/3

శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు 3
3/3

శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement