ఉత్సాహంగా ఉమ్మడి జిల్లా స్థాయి రగ్బీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఉమ్మడి జిల్లా స్థాయి రగ్బీ పోటీలు

Feb 16 2026 8:00 AM | Updated on Feb 16 2026 8:00 AM

ఉత్సా

ఉత్సాహంగా ఉమ్మడి జిల్లా స్థాయి రగ్బీ పోటీలు

ఉత్సాహంగా ఉమ్మడి జిల్లా స్థాయి రగ్బీ పోటీలు హోరాహోరీగా నెట్‌ బాల్‌ టోర్నమెంట్‌

గన్నవరం: స్థానిక జెడ్పీ బాలురోన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి అండర్‌–12 బాలబాలికల రగ్బీ పోటీలు, జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించారు. తొలుత ఈ పోటీలను రగ్బీ అసోసియేషన్‌ జిల్లా చైర్మన్‌ మడుపల్లి బాలకృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు బొప్పన హరికృష్ణ ప్రారంభించారు. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన 300 మంది బాలబాలికలు పాల్గొన్నారు. అనంతరం జరిగిన పోటీల్లో బాలుర విభాగంలో పెద్దఆవుటపల్లి జట్టు విజేతగా నిలవగా, నున్న జెడ్పీ హైస్కూల్‌ జట్టు ద్వితీయ స్థానం, విజయవాడ ఎంఎస్‌ఆర్‌ పాఠశాల జట్టు, వీరపనేనిగూడెం జెడ్పీ హైస్కూల్‌ జట్టు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో విజయవాడ ఎంఎస్‌ఆర్‌ పాఠశాల జట్టు ప్రథమ స్థానం సాధించగా, నున్న జెడ్పీ హైస్కూల్‌ జట్టు ద్వితీయ స్థానం, ఉంగుటూరు జెడ్పీ హైస్కూల్‌ జట్టు, ప్రసాదంపాడులోని వివేకానంద స్కూల్‌ జట్టు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.

జిల్లా జట్లకు ఎంపిక..

అనంతరం వరుసగా నాలుగు స్థానాల్లో నిలిచిన బాలబాలికల జట్లకు రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గరికపాటి శివశంకర్‌ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో అత్యుత్తమ క్రీడా ప్రదర్శన కనబరిచిన బాలబాలికలను ఉమ్మడి జిల్లా జట్లకు ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి జి.రాంబాబు తెలిపారు. వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేవీఆర్‌ కిషోర్‌, ఎన్టీఆర్‌ జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి శ్రీలత, రగ్బీ అసోసియేషన్‌ జిల్లా సంయుక్త కార్యదర్శులు నరసింహ, సీహెచ్‌ బాలకృష్ణ, నియోజకవర్గ క్రీడా సమన్వయకర్త ధనియాల నాగరాజు, పలువురు వ్యాయామ విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ నెట్‌బాల్‌ (ఉమెన్‌) టోర్నమెంట్‌–2025–26 పోటీలు స్థానిక మేరీస్‌ స్టెల్లా కళాశాల ఆవరణలో ఆదివారం హోరాహోరీగా జరిగాయి. కృష్ణాజిల్లా జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ, కృష్ణా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ కూన రాంజీ, యూనివర్సిటీ రెక్టార్‌ ఎం.బసవేశ్వరరావు, స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్‌ ఇన్యాసమ్మతో పాటుగా యూనివర్సిటీ క్రీడావిభాగం అధికారులు ఆదివారం జరిగిన మ్యాచ్‌లను పరిశీలించారు.

ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లు

–టీఎన్‌పీఈ యూనివర్సిటీ, చైన్నె – రాణి చన్నమ్మ యూనివర్సిటీపై 36–19 విజయం సాధించింది. సావిత్రీబాయి పూలే యూనివర్సిటీ పుణే –ఎంజీయూ కొట్టాయం పై 48–43 విజయం సాధించింది. ఆర్‌టీఎంఎన్‌యూ, మహారాష్ట్ర – దేవి అహిల్యా యూనివర్సిటీ, ఇండోర్‌పై 47–31, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హర్యానా, సోనిపట్‌ బెంగళూరు యూనివర్సిటీపై 43–38, హేమచంద్‌ యాదవ విశ్వవిద్యాలయ, దుర్గ్‌ (సీజీ)– కెబీసీఎన్‌ఎంయూ జల్గావ్‌ (ఎంహెచ్‌)పై 43–18 విజయం, బెంగళూరు యూనివర్సిటీ– డాక్టర్‌ రామ్మనోహర్‌ లోహియా అవధ్‌ యూనివర్సిటీపై 36–05 విజయం సాధించాయి. అటల్‌ బిహారీ వాజ్‌పేయి విశ్వవిద్యాలయం, బిలాస్పూర్‌ – రాజీవ్‌ గాంధీ విశ్వవిద్యాలయం, భోపాల్‌ యూనివర్సిటీ పై 60–24, కృషా్‌ణ్‌ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్‌ – జేఎన్టీయూ హైదరాబాద్‌ పై 42–27, కావికులగురు కాలిదాస సంస్కృత యూనివర్సిటీ, రామ్టెక్‌–ఉత్కల్‌ యూనివర్సిటీ, ఒడిశాపై 53–18, కేరళ యూనివర్సిటీ – భారతిదాసన్‌ యూనివర్సిటీపై 44–24, మంగళూరు యూనివర్సిటీ – గోండ్వానా యూనివర్సిటీపై 34–04, మహర్షి దయానంద యూనివర్సిటీ, రోహ్తక్‌ (పంజాబ్‌)– తుమ్కూర్‌ యూనివర్సిటీ, కర్ణాటకపై 43–11,యూనివర్సిటీ ఆఫ్‌ కాలికట్‌–పంజాబ్‌ యూనివర్సిటీ పాటియాలాపై 56–26 స్కోరుతో విజయం సాధించాయి. పోటీల అనంతరం జరిగిన క్యాంప్‌ఫైర్‌లో విద్యార్థులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా ఉమ్మడి జిల్లా స్థాయి రగ్బీ పోటీలు  1
1/1

ఉత్సాహంగా ఉమ్మడి జిల్లా స్థాయి రగ్బీ పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement