కొత్త పెన్షన్ల ఊసే లేదు..
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న ఆలోచన చంద్రబాబు సర్కారుకు ఏ కోశానా కనిపించడం లేదు. అందుకు ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రత్యక్ష ఉదాహరణ. కేవలం అమరావతి జపం చేస్తూ చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతూ పరిపాలన సాగిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు కొత్తగా ఒక్క పెన్షన్ గానీ, రేషన్ కార్డు కానీ, ఇంటి స్థలం కానీ మంజూరు చేయలేదు. ఇంతకంటే చెత్త పరిపాలన రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ చూడలేదు. ప్రజలకు మేలు చేయకుండా సాగిస్తున్న పరిపాలనను ప్రశ్నించిన నేతలపై కేసులు పెట్టి కాలం వెళ్లదీస్తున్నారు.
– కారుమంచి కామేశ్వరరావు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్


