జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఉపాధ్యాయుడి ఎంపిక
నందివాడ: పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్‌లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు వెన్ననపూడి వ్యాయా మ ఉపాధ్యాయుడు పరిశే ఏసురత్నం ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్‌వై మాధవ్‌కుమార్ తెలిపారు. ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా ఆయన వ్యవహరించననున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఏసురత్నంను ఉపాధ్యాయులు, రాజకీయ ప్రముఖులు అభినందించారు.
విజయవాడలీగల్: నకిలీ మద్యం కేసులో రిమాండ్‌లో ఉన్న ఏ21 సుదర్శన్ తరఫు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌పై ఎకై ్సజ్ న్యాయస్థానంలో సోమవారం వాదనలు జరిగాయి. న్యాయమూర్తి లెనిన్‌బాబు తీర్పును ఈనెల 17వ తేదీకి వాయిదా వేశారు. ఇదే కేసులో మదనపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న ఏ22 సీపీ సెంథిల్ పీటీ వారెంట్ కోరుతూ విజయవాడ ఎకై ్సజ్ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్‌ను అనుమతిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. దీంతో సెంథిల్‌ను విజయవాడ ఎకై ్సజ్ న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈనెల 19వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. అనంతరం విజయవాడ జిల్లా జైలుకు సెంథిల్‌ను తరలించారు.
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సాయంత్రం భారతీయ రిజర్వు బ్యాంకు ఆధ్వర్యాన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ముద్రించిన వాల్‌పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. జేసీ నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.
మంగళగిరి టౌన్ : మంగళగిరిలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం మూడోరోజు స్వామివారు శేషవాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామిని దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలువురు దాతలు ఆలయంలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన కీర్తిశేషులు గోలి సుబ్బారావు జ్ఞాపకార్థం వారి కుమారులు గోలి చిన్నారావు, గోలి నాగేశ్వరరావు, గోలి సాంబశివరావు, గోలి శ్రీనివాసరావు వ్యవహరించారు. దేవస్థాన ఈ.ఓ. గోపి ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు.
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఉపాధ్యాయుడి ఎంపిక
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఉపాధ్యాయుడి ఎంపిక


