ఘనంగా శ్రీకృష్ణ దేవరాయుల మహోత్సవాలు
శ్రీకాకుళం(ఘంటసాల): తెలుగు బాష ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియజేసేలా శ్రీకృష్ణ దేవరాయుల మహోత్సవాలు ఉన్నాయని ఎస్పీ పి.విద్యాసాగర్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణు ఆలయ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, ఏపీ దేవదాయ శాఖ సహకా రంతో దివి ఐతిహాసిక మండలి ఆధ్వర్యంలో ఆంధ్ర భోజ శ్రీకృష్ణ దేవరాయుల మహోత్సవాలు రెండో రోజు బుధవారం వైభవంగా జరిగాయి. ఈ సంద ర్భంగా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు మాట్లాడుతూ.. తమిళుల మాదిరిగా మనం కూడా తెలుగు బాషను గౌరవిస్తూ ప్రేమించాలన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ కమిషన్ చైర్మన్ తేజస్వి పొడపాటి మాట్లాడుతూ.. తెలుగును రాజభాషగా చేసిన యోధుడు శ్రీకృష్ణ దేవరాయులన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ.. తెలుగు బాషకు పూర్వపు ఔన్నత్యం, పునరుద్ధరణే ఈ ఉత్సవాల ద్యేయమన్నారు. ముందుగా శ్రీకృష్ణ దేవరాయుల విగ్రహం వద్ద ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌తో కలసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ విద్యా సాగర్‌నాయుడు, తేజస్వి, ఏపీ నాటక అకాడమీ చైర్మన్‌గుమ్మడి గోపాలకృష్ణ, సాహితీవేత్త అద్దంకి శ్రీనివాసరావు, నాట్యాచార్య కె.వి.సత్యనారాయణను ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పి.సాయిబాబు, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.


