దాములూరు సంగమేశ్వరుడికి రూ. 12.09 లక్షల ఆదాయం | - | Sakshi
Sakshi News home page

దాములూరు సంగమేశ్వరుడికి రూ. 12.09 లక్షల ఆదాయం

Feb 18 2026 7:57 AM | Updated on Feb 18 2026 7:57 AM

దాముల

దాములూరు సంగమేశ్వరుడికి

దాములూరు సంగమేశ్వరుడికి రూ. 12.09 లక్షల ఆదాయం అమృతలింగేశ్వరస్వామికి రూ.5.92 లక్షల ఆదాయం ముక్త్యాల సర్పంచ్‌, కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు పోక్సో కేసులో నిందితుడికి జైలు, జరిమానా గ్రంథాలయ ఉద్యోగులకు బడ్జెట్‌లో అరకొర కేటాయింపులే.. ఉత్కంఠగా నెట్‌బాల్‌ టోర్నమెంట్‌ ● మంగళవారం జరిగిన మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగాయి. కాలికట్‌ యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ మధ్య జరిగిన మ్యాచ్‌లో 66–26 గోల్స్‌ తేడాతో ‘కాలికట్‌’ విజయం సాధించింది. ● సావిత్రీబాయి ఫూలే యూనివర్సిటీ, పూణే–హేమచంద్‌ యాదవ విశ్వవిద్యాలయం మధ్య జరిగిన పోటీలో 61–59 గోల్స్‌ తేడాతో ‘పూలే’ యూనివర్సిటీ గెలుపొందింది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, కృష్ణా యూనివర్శిటీ వైస్‌చాన్సలర్‌ కూన రాంజీ, స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్‌ జి. ఇన్యాసమ్మ పోటీలను వీక్షించి విజేతలను అభినందించారు. రసవత్తరంగా ఎడ్ల పూటీ లాగుడు పోటీలు

నందిగామ రూరల్‌: దాములూరు కూడలిలోని సంగమేశ్వరస్వామికి హుండీ కానుకల ద్వారా రూ. 12.09 లక్షల ఆదాయం వచ్చిందని ఈవో నరసింహమూర్తి పేర్కొన్నారు. గ్రామంలోని ఆలయ ఆవరణలో మంగళవారం హుండీ కానుకలు లెక్కించారు. ఈ సందర్భంగా కానుకల ద్వారా రూ. 4.58 లక్షలు, పూజ టికెట్‌ల ద్వారా రూ. 5.77 లక్షలు, కల్యాణం కానుకల చదివింపుల ద్వారా రూ.12,143, లడ్డూ ప్రసాదాలు అమ్ముకునే హక్కు వేలం పాట ద్వారా రూ.లక్ష, కొబ్బరిచిప్పలు పోగు చేసుకునే హక్కు ద్వారా రూ. 60,500 ఆదాయం వచ్చింది. కార్యక్రమంలో ఆలయాల ఇన్‌స్పెక్టర్‌ పవన్‌ కల్యాణ్‌, దుర్గా శివ సాయి సేవా సమితి సభ్యులు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.

ముక్త్యాల(జగ్గయ్యపేట): కోటిలింగాల అమృతలింగేశ్వరస్వామికి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హుండీ ద్వారా రూ. 5.92 లక్షల ఆదాయం వచ్చిందని ఈవో హరిదుర్గా నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. అభిషేకాలు, దర్శనాలు, శివలింగ ప్రతిష్ట, విరాళాలు, అన్నదానం, లడ్డూ ప్రసాదాల ద్వారా ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. లెక్కింపులో నందిగామ దేవాలయ ఇన్‌స్పెక్టర్‌ పవన్‌కల్యాణ్‌, ఉత్సవాల అధికారి జయప్రకాష్‌, తదితరులు పాల్గొన్నారు.

నిధులు దుర్వినియోగమే కారణం!

ముక్త్యాల(జగ్గయ్యపేట): గ్రామ పంచాయతీలో అవకతవకలపై గతేడాది జూలైలో గ్రామ యువకులు జిల్లా అధికారులకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. 2021–25 కాలంలో జరిగిన అవకతవకలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దాదాపు రూ.2.9 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు తేలడంతో సోమవారం రాత్రి జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు ప్రస్తుత సర్పంచ్‌ షేక్‌ అస్మతున్‌, గత కార్యదర్శులు ఎన్వీ నరసింహారావు, శ్రీనివాసరెడ్డి, సిద్ధారెడ్డిలకు షోకాజ్‌ నోటీసులను ఈవోపీఆర్డీ పద్మావతి జారీ చేశారు. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నిధులు దుర్వినియోగమైనా జిల్లా, మండల అధికారులు సైతం సమాచారం అందించేందుకు కూడా దాటవేత ధోరణి అవలంబించడం గమనార్హం.

విజయవాడలీగల్‌: బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ పోక్సో కోర్ట్‌ న్యాయమూర్తి వేల్పుల భవాని తీర్పునిచ్చారు. నున్న పీఎస్‌ పరిధిలోని ఓ బాలిక (17) కళాశాల నుంచివచ్చి ఇంటికి వెళ్లే క్రమంలో పలుమార్లు ప్రేమిస్తున్నానని అదే ఏరియాకు చెందిన గోగులమూడి అశోక్‌ చక్రవర్తి అలియాస్‌ అశోక్‌ (23) వెంటపడుతున్నాడు. పెద్దలు మందలించినా మారకపోవడంతో నున్న పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు. 2014 నవంబరు 7న అశోక్‌ చక్రవర్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్‌ తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గడ్డం రాజేశ్వరరావు, సీఎంఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్వరరావు, నున్న ఇన్‌స్పెక్టర్‌ కృష్ణమోహన్‌ పర్యవేక్షణలో ఐదుగురు సాక్షులను విచారణ చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో మంగళవారం న్యాయమూర్తి పైవిధంగా తీర్పు ఇచ్చారు.

సంఘం జిల్లా అధ్యక్షుడు కృపానందం

గన్నవరం రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో గ్రంథాలయాలకు సరిపడా నిధులు కేటాయించకపోవడం అన్యాయమని గ్రంథాలయ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు కె.కృపానందం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పేర్కొన్నారు. ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి కేవలం 36.34కోట్లు కేటాయించటం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. రెండేళ్లుగా రిటైరైన ఉద్యోగులకు రూ.20కోట్లు బెనిఫిట్స్‌ చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లకు సుమారు పది కోట్లు అవసరం కాగా, సంవత్సరానికి రూ.120 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. జూలైలో 25 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేస్తున్నారని, వారికి మరో రూ.15 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్లు అవసరం కాగా కేవలం రూ.36.30 కోట్లు ప్రతిపాదించడం తీవ్ర అన్యాయమని, ప్రభుత్వం దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్తామని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో గతేడాది డిసెంబర్‌ నుంచి జీతాలు, పెన్షన్‌లు చెల్లించలేదని, ఫిబ్రవరి నుంచి పది ఉమ్మడి జిల్లాల్లో ఉద్యోగులకు, పెన్షన్‌ దారులకు చెల్లించేందుకు తగిన నిధులు జిల్లా గ్రంథాలయ సంస్థల్లో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లు 010 పద్దు నుండి చెల్లించాలని, పూర్తిగా గ్రాంటు విడుదల చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.చినరాజు కూడా డిమాండ్‌ చేశారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని మేరీస్‌ స్టెల్లా కళాశాల ఆవరణలో జరుగుతున్న ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ నెట్‌బాల్‌(మహిళల)టోర్నమెంట్‌ ఉత్కంఠగా జరుగుతోంది. బుధవారం ఫైనల్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటితో టోర్నమెంట్‌ ముగుస్తుంది.

హోరాహోరీగా

ందిగామ రూరల్‌: దాములూరు సంగమేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పూటీ లాగుడు పోటీలను సర్పంచ్‌ గాదెల వెంకట రామారావు, ఆలయ కమిటీ చైర్మన్‌ శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహా శివరాత్రి సందర్భంగా కల్యాణ ఉత్సవాల ముగింపు తర్వాత ఎడ్ల పూటీ లాగుడు పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. న్యూ జూనియర్‌ విభాగం పోటీల్లో తొమ్మిది జతల ఎడ్లు పాల్గొని ఆరుగురు వ్యక్తుల సాయంతో 1.5 క్వింటాళ్ల బరువును 10 నిముషాల వ్యవధిలో లాగాయని చెప్పారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

దాములూరు సంగమేశ్వరుడికి                                1
1/2

దాములూరు సంగమేశ్వరుడికి

దాములూరు సంగమేశ్వరుడికి                                2
2/2

దాములూరు సంగమేశ్వరుడికి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement