స్పటికేశ్వరుడిగా సంగమేశ్వరుడు | - | Sakshi
Sakshi News home page

స్పటికేశ్వరుడిగా సంగమేశ్వరుడు

Feb 18 2026 7:57 AM | Updated on Feb 18 2026 7:57 AM

స్పటికేశ్వరుడిగా సంగమేశ్వరుడు

స్పటికేశ్వరుడిగా సంగమేశ్వరుడు

1008 స్పటిక మాలలతో విశేష అభిషేకం ముగిసిన సంగమేశ్వరస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

సంగమేశ్వరం(నాగాయలంక): సంగమేశ్వరంలోని శ్రీగంగాపార్వతీ సమేత సంగమేశ్వరస్వామి వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా ముగిశాయి. దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యాన నాలుగు రోజులుగా కొనసాగిన ఉత్సవాల్లో 1008 స్పటిక మాలలతో చేసిన విశేష అభిషేకం ఆధ్యాత్మిక సౌరభంగా నిలిచింది. ఉత్సవాల్లో సోమవారం అర్ధరాత్రి స్వామివారికి స్పటిక మాలలతో అభిషేకం చేశారు. అనంతరం సంగమేశ్వరం వీధుల్లో స్వామివారి రథోత్సవం రాత్రంతా శోభాయమానంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముగింపు పురస్కరించుకుని మంగళవారం గ్రామస్తులు, భక్తులు ఆధ్వర్యంలో పార్వతీ సమేత సంగమేశ్వర స్వామివారి సముద్ర విహార ఊరేగింపు, అనంతరం గ్రామంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, ధ్వజావరోహణ, పవళింపు సేవలతో బ్రహ్మోత్సవాలకు స్వస్తి పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement