వెంటిలేట్‌ర్లు
విజయవాడ జీజీహెచ్‌లో మృత్యుఘోష
పెరిగిన మరణాలు
వెంటిలేటర్లకూ గతిలేదు
లబ్బీపేట(విజయవాడతూర్పు): పేదల ప్రాణాలకు పెద్దదిక్కుగా నిలవాల్సిన విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో మృత్యుఘోష కొనసాగు తోంది. ఆస్పత్రిలో సేవలు రోజు రోజుకూ దిగజారు తున్నాయి. నిపుణులైన వైద్యులు, సమర్థంగా పనిచేసే అధికారులు ఉన్నా ప్రభుత్వం సౌకర్యాలు కల్పించక పోవడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నెలకొంది. అత్యవసర సమయంలో రోగుల ప్రాణాలు నిలిపేందుకు అత్యంత కీలకమైన వెంటిలేటర్లు కావాలని ఆరు నెలల కిందటే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అయితే అవి ఇంత వరకూ ఆస్పత్రికి చేరలేదు. ఉన్న వెంటిలేటర్లు పనిచేయకపోవడంతో వాటిని మూలన పడేశారు. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో రోగులకు ఊపిరి అందించేందుకు ఉన్న అరకొర యంత్రాలతోనే వైద్యులు కుస్తీ పడుతున్నారు. ఈ తరుణంలో మరణాల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
వెంటిలేటర్లు కొనుగోలులో జాప్యం
ప్రభుత్వాస్పత్రిలో ఉన్న వెంటిలేటర్లు దాదాపు పనిచేయని స్థితికి చేరాయి. కోవిడ్ సమయంలో కొనుగోలు చేసిన వెంటిలేటర్లులో చాలా వాటిని ఇప్పటికే పక్కన పెట్టేశారు. అనంతరం గత ప్రభుత్వంలో వచ్చిన వెంటిలేటర్లు కొన్ని ఉండగా వాటితోనే కుస్తీ పడుతున్నారు. వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు సిద్ధార్థ వైద్య కళాశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2023వ సంవత్సరంలో మంజూరు చేసి, డీఎంఈ వద్ద ఉన్న పీజీ గ్రాంట్స్‌తో వెంటిలేటర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఆరు నెలల కిందటే కొనుగోలు చేస్తున్నట్లు చెప్పినా, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆస్పత్రిలో ఎవరికై నా వెంటిలేటర్ సపోర్టు అవసరమైతే, అందుబాటులో ఉన్న వాటిపై ఉంచేందుకు వైద్యులు సంకోచించాల్సిన పరిస్థితినెలకొంది. అవి సరిగా పనిచేయక పోతే, రోగికి ప్రాణాపాయం అని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తోంది. డీఎంఈలో నిర్లక్ష్యం చేయడంతో రోగులకు శాపంలా మారింది.
ప్రభుత్వాస్పత్రిలో కోవిడ్ తర్వాత నిత్యం 12 నుంచి 14 మంది వరకూ మరణించే వారు. వారిలో క్రిటికల్ స్టేజ్‌లో ఆస్పత్రికి వచ్చిన వారు ఎక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య రోజుకు 18 నుంచి 20కి చేరింది. ఒక్కో రోజు 20 మంది కంటే ఎక్కువగానే ప్రాణాలు కోల్పోతున్నారు. జీజీహెచ్‌లో 2025 జనవరిలో 504 మంది మృత్యువాత పడ్డారు. 2026 జనవరి 523 మంది మృతి చెందారు. ఇలా మృతుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఒక వైపు పాలకులు నాణ్యమైన సౌకర్యాలు అంటూ ప్రగల్బాలు పలుకుతున్నారే కానీ క్షేత్రస్థాయిలో ఆస్పత్రులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా ప్రాణాలు నిలుస్తాయన్న కొండంత ధైర్యంతో ప్రభుత్వాస్పత్రికి వస్తున్న నిరుపేద రోగులు నాణ్యమైన సేవలు అందక విలవిల్లాడుతున్నారు.
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాస్పత్రిలో వెంటిలేటర్లు కొనుగోలుకూ గతిలేకుండా పోయింది. గత ప్రభుత్వంలో కోవిడ్ సమయంలో వచ్చిన వాటితోనే వైద్యులు కుస్తీ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటిలేటర్ సరిగా పనిచేయక, రోగి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పటికై నా జాప్యం చేయకుండా వెంటిలేటర్లను కొనుగోలు చేసి, జీజీహెచ్‌కి అందించాలి.
– డాక్టర్ ప్రభుదాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం
వెంటిలేట్‌ర్లు
వెంటిలేట్‌ర్లు


