దుర్గగుడికి విరాళాలు | - | Sakshi
Sakshi News home page

దుర్గగుడికి విరాళాలు

Feb 10 2026 8:14 AM | Updated on Feb 10 2026 8:14 AM

దుర్గ

దుర్గగుడికి విరాళాలు

దుర్గగుడికి విరాళాలు వైద్యశాఖలో డెమో సేవలు కీలకం జి.కొండూరులోడ్రగ్స్‌పై దండయాత్ర

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయానికి సోమ వారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడ గొల్లపూడికి చెందిన వెనిగళ్ల కృష్ణకుమారి కుటుంబం అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి రూ.5,00,116 విరాళాన్ని ఆలయ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణకు అందజే సింది. ఆలయ అభివృద్ధి పనులకు సంతరావూరు గ్రామానికి చెందిన కొప్పుల రవికిరణ్‌ కుటుంబం రూ.1,01,116 విరాళాన్ని ఆలయ చైర్మన్‌కు అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రా లను అందజేశారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య, ఆరోగ్య శాఖలో డెమో విభాగం సేవలు అత్యంత కీలక మని ఎన్టీఆర్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మాచర్ల సుహాసిని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ మీడియా అధికారులు(డెమోల) సంఘం – అమరావతి 2026 క్యాలెండర్‌, డైరీని సోమవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సుహాసిని మాట్లాడుతూ.. ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో డెమోలు కీలక పాత్ర వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఎంఓ డాక్టర్‌ నవీన్‌, డాక్టర్‌ బాలాజీ, డాక్టర్‌ కార్తీక్‌, డాక్టర్‌ సాగర్‌, గణాంక అధికారి లక్ష్మోజి, రాజశేఖర్‌, బాషా ఏపీ ఎంఓహెచ్‌ఈ అసోసి యేషన్‌ అధ్యక్షుడు చదలవాడ నాగేశ్వరరావు, కొవ్వూరి ప్రభాకరరెడ్డి, ఎంఎంవై శ్రీనివాస్‌, మహ్మద్‌ యూసుఫ్‌, పుష్పరాణి తదితరులు పాల్గొన్నారు.

జి.కొండూరు: డ్రగ్స్‌ నిర్మూలనలో భాగంగా పోలీసు శాఖ చేపట్టిన డ్రగ్స్‌పై దండయాత్ర ర్యాలీ సోమవారం జి.కొండూరులో కొనసా గింది. అడ్మిన్‌ డీసీపీ సరిత, రూరల్‌ డీసీపీ లక్ష్మీ నారాయణ నేతృత్వంలో మండలంలోని కట్టుబడిపాలెం గ్రామం వద్ద మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన సైకిల్‌ ర్యాలీ పినపాక, విద్యానగరం, జి.కొండూరు వై జంక్షన్‌ మీదుగా మధ్యాహ్నం మూడు గంటలకు జి.కొండూరు చేరింది. ఈ ర్యాలీకి మైలవరం ఏసీపీ ప్రసాదరావు, సీఐ దాడి చంద్రశేఖర్‌, ఎస్‌ఐలు సతీష్‌కుమార్‌, గిరిజామణి, స్థానికులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జి.కొండూరులో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో డీసీపీలు సరిత, లక్ష్మీనారాయణ, ఏసీపీ ప్రసాదరావు మాట్లాడుతూ.. డ్రగ్స్‌ వినియోగించడం, విక్రయించడం చట్టరీత్యా నేరమన్నారు. పిల్లలు డ్రగ్స్‌ బారిన పడకుండా తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. డ్రగ్స్‌ నిర్మూలనే లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో 510 కిలోమీటర్లు మేర సైకిల్‌ ర్యాలీ చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేములకొండ లక్ష్మీతిరుపతమ్మ, పోలీసు సిబ్బంది, వివిధ పాఠ శాలల విద్యార్థులు పాల్గొన్నారు.

దుర్గగుడికి విరాళాలు1
1/2

దుర్గగుడికి విరాళాలు

దుర్గగుడికి విరాళాలు2
2/2

దుర్గగుడికి విరాళాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement